నల్లగొండ జిల్లా:చదువు,ఆట పాటలతో హాయిగా బడిలో గడపాల్సిన బాల్యం అందుకు విరుద్ధంగా పనిలో మగ్గుతున్నా పట్టించుకునే నాథుడే లేడని మాల్ పట్టణానికి చెందిన ప్రజలు,ప్రయాణికులు వాపోతున్నారు.వివరాల్లోకి వెళితే…నల్లగొండ జిల్లా మాల్ పట్టణ బస్టాండ్ లో ఛాయ్, సమోసా,బిస్కెట్స్ అమ్ముతూ ఓ విద్యార్థి బాలకార్మికుడిగా మారడం చూసి,అయ్యేపాపం చదువుకోవాల్సిన వయసులో ఈ పిల్లాడికి ఎంత కష్టం వచ్చిందని ప్రయాణికులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రభుత్వాలు అనేక సంస్కరణలు చేపడుతుంటే,వాటిని అమలు చేయడంలో స్థానిక అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.బడిలో చదువుకోవాల్సిన విద్యార్థి బస్టాండ్ లో కూలీ పని చేస్తున్నారని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం,కనీసం ఆ విద్యార్థిని షాపులో పనికి పెట్టుకున్న యజమానిపై చర్యలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయంపై అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నిషితను వివరణ అడగగా మేము ఏం చేయాలని ఎదురు ప్రశ్నించడం గమనార్హం.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థిని పనిలో పెట్టుకున్న షాపు యజమానిపై చర్యలు తీసుకొని,ఆబాలుడిని బడిలో చేర్పించి,అతనికి బంగారు భవిష్యత్ ఉండేలా చూడాలని కోరుతున్నారు.







