వేణుమాధవ్ కామెడీగా చెప్పిందే సినిమా తీసి హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్.. ఏమైందంటే?

దర్శకుడు ప్రశాంత్ నీల్( Directed Prashant Neel ) దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యశ్ ( Star hero Yash )హీరోగా నటించిన సినిమా కేజిఎఫ్.కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

 Venumadhav Comedy Scene Linked To Kgf, Venu Madhav, Comedy Scene, Kgf, Yash-TeluguStop.com

కోటల్లో కలెక్షన్స్ను సాధించడంతో పాటు రికార్డుల మీద రికార్డులు సృష్టించింది.అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఈ సినిమా సెన్సేషన్లో క్రియేట్ చేసింది.

ఈ సినిమాతో కన్నడ హీరో యష్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.కేజిఎఫ్ పార్ట్ వన్,పార్ట్ టు రెండు సినిమాలు కూడా సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.

Telugu Scene, Venu Madhav, Venumadhavscene, Yash-Movie

ఇకపోతే 2018లో విడుదలైన ఈ సినిమా గురించి ఇప్పుడు తాజాగా మరోసారి చర్చ మొదలైంది.సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఈ సినిమా విషయమై ఒక కొత్త పాయింట్‌ ని తెరపైకి తెచ్చారు.దీంతో అది సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.రవితేజ, పూరి జగన్నాథ్‌ ( Ravi Teja, Puri Jagannath )కాంబినేషన్‌ లో వచ్చిన నేనింతే సినిమాలో డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్‌గా చేరేందుకు రకరకాల ప్రయత్నాలు చేసే కుర్రాడిగా వేణుమాధవ్‌ కనిపిస్తాడు.

ఫీల్డ్‌లో వున్న అసిస్టెంట్‌ డైరెక్టర్లకు రకరకాల కథలు చెబుతాడు.కానీ ఎవరూ అతన్ని ఎంకరేజ్‌ చెయ్యరు.తెలుగు వారికి తెలుగు వారి సపోర్ట్‌ ఉండదన్న ఉద్దేశంతో తన పేరును సెంథిల్‌గా మార్చుకొని తమిళ డైరెక్టర్‌గా అందర్నీ పరిచయం చేసుకుంటాడు.

Telugu Scene, Venu Madhav, Venumadhavscene, Yash-Movie

ఆ సినిమాలో హీరో మల్లిక్‌గా నటించిన సుబ్బరాజుకు( Subbaraju ) కథ వినిపించడానికి రెడీ అవుతాడు.తమిళ్‌, తెలుగును మిక్స్‌ చేస్తూ ఒక కథ నేరేట్‌ చేస్తాడు.కన్నులెంది ఒరూ జూమ్‌ బ్యాక్‌ వంద ఫస్ట్‌ షాట్‌.

అంటూ ఆ కథలోని కొన్ని సీన్స్‌ని చెబుతాడు.ఆ సీన్‌లో కామెడీ అద్భుతంగా పండింది.

అయితే అక్కడ ఆ సీన్ లో వేణుమాధవ్‌ కామెడీగా చెప్పిన ఆ కథే కెజిఎఫ్‌ స్టోరీ.ఆ కథలో చెప్పిన సీన్స్‌ అన్నీ కెజిఎఫ్‌లో ఉన్నాయి.

ఈ కామెడీ షాట్‌ను, కెజిఎఫ్‌ విజువల్స్‌ని మిక్స్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు ఒక నెటిజన్‌.అది ఇప్పుడు వైరల్‌గా మారింది.

వేణుమాధవ్‌ వాయిస్‌ లో కెజిఎఫ్‌ విజువల్స్‌ చూస్తుంటే అతను చెప్పిన స్టోరీ కరెక్ట్‌గా సరిపోయింది అనిపిస్తుంది.దీనిపై నేటిజన్స్ స్పందిస్తూ… వేణుమాధవ్‌ కామెడీ కోసం చెప్పిన ఆ స్టోరీని ప్రశాంత్‌ నీల్‌ సీరియస్‌గా భారీగా తీసేశాడన్నమాట అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube