జుట్టుకు రంగు వేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ నేచురల్ కలర్స్ మీ కోసమే

జుట్టుకు రంగు వేసుకున్నప్పుడు ఆ రంగు పడకపోతే జుట్టు కాంతివిహీనంగా మారుతుంది.అంతేకాక జుట్టు కూడా రాలిపోతుంది.

 Natural Colors For Hair Dye-TeluguStop.com

ఆలా కాకుండా జుట్టు బలంగా,ఆరోగ్యంగా,జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ సహజసిద్ధమైన కలర్స్ వాడాలి.వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఈ కలర్స్ ని తేలికపాటి షాంపూతో తలస్నానము చేసాక మాత్రమే ఉపయోగించాలి.

జుట్టు బ్రౌన్ కలర్ రావాలంటే ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ కాఫీ గింజలు లేదా కాఫీ పొడి వేసి 15 నిమిషాల పాటు మరిగించాలి.ఈ మిశ్రమాన్ని వడకట్టి తలకు బాగా పట్టించాలి.20 నిముషాలు అయ్యాక జుట్టును కడగాలి

జుట్టు నలుపు రంగు రావాలంటే ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ కాఫీ గింజలు లేదా కాఫీ పొడి,పావు స్పూన్ లవంగాల పొడి వేసి 15 నిమిషాల పాటు మరిగించాలి.ఈ మిశ్రమాన్ని వడకట్టి తలకు బాగా పట్టించాలి.20 నిముషాలు అయ్యాక జుట్టును కడగాలి

జుట్టుకు పర్పుల్‌ కలర్‌ రావాలంటే ఒక కప్పు నీటిలో బీట్ రూట్ పేస్ట్ వేసి బాగా మరిగించాలి.ఆ నీటిని వడకట్టి రాత్రి సమయంలో జుట్టు మొత్తానికి పట్టించి తల మాడు మీద 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి.మరుసటి రోజు ఉదయం నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు పర్పుల్‌ కలర్‌ లోకి మారుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube