వైరల్ వీడియో: పెన్సిల్ మొనపై చిన్ని కృష్ణుడిని భలే చేసాడుగా..

నేడు ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణ పరమాత్మ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు.భక్తిశ్రద్ధలతో భక్తులు ఉదయాన్నే శ్రీకృష్ణ పరమాత్మని గుడిలకి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 Vizag Micro Artist Creates Sri Krishna Art On Pencil Nib Video Viral Details, Pe-TeluguStop.com

సోషల్ మీడియాలో కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి( Sri Krishna Janmashtami ) సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భక్తిని నిరూపించుకున్నారు.

ఇకపోతే తాజాగా తనదైన శైలిలో పెన్సిల్ ఫై( Pencil ) అతి సూక్ష్మంగా కృష్ణుడి కళారూపం చెక్కి అబ్బురపరిచాడు ఓ కళాకారుడు.పెన్సిల్ ముక్క పై చెక్కిన కృష్ణుడి రూపం చూస్తే నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే.

కృష్ణుడు తలపై ఉన్న నెమలి పించం, అలాగే చేతిలో మురళి, వంటి కాలపై నిలిచిన విధంగా కలకండని సృష్టించాడు.ఉమ్మడి విశాఖ జిల్లా( Vishakapatnam District ) నక్కపల్లి మండలం చిన్న దొడ్డి గుళ్ళు గ్రామానికి చెందిన వెంకటేష్( Venkatesh ) ఓ మైక్రో ఆర్టిస్ట్.సందర్భానికి అనుగుణంగా సూక్ష్మ కలఖండాలని సృష్టిస్తుంటాడు.ప్రస్తుతం సృష్టించిన ఈ కలకండం కేవలం 8 mm ఎత్తు, 14 mm వెడల్పుతో అబ్బురపరిచాడు.

ఐదు గంటల సమయం కస్టపడి ఈ అద్భుత కలఖండాన్నీ రూపొందించాడు.ఇదివరకే అనేక దేవత మూర్తులు విగ్రహాలను రూపొందించిన వెంకటేష్ తాజాగారు శ్రీకృష్ణ కళాఖండాన్ని చెక్కి అందరి ప్రశంసలను అందుకున్నాడు.ఇప్పటికే అనేక దేవతామూర్తుల విగ్రహాలను, ఇంకా అనేక కళారూపాలను పెన్సిల్ మొనపై చెక్కి ప్రశంసలు అందుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్నాడు.అలాగే అనేక అవార్డులు సొంతం చేసుకున్న వెంకటేష్ తనకు కృష్ణుడిపై ఉన్న భక్తిని ఈ విధంగా చాటాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube