రోజురోజుకూ కొందరు మనుషుల్లో వెర్రితనం ఎక్కువైపోతుంది.వీళ్లు చేస్తున్న మూర్ఖపు పనులు చాలామందికి షాకిస్తున్నాయి.
తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ప్రయాగ్రాజ్ సిటీలో ఒక వ్యక్తి రైల్వే ట్రాక్( Railway track )పై నిద్రించాడు.రైల్వే ట్రాక్ తన ఇంట్లోని సొంత సోఫా అన్నట్లు దర్జాగా అతడు పడుకున్నాడు.
ప్రాణాలపై ఆశ ఉన్న వారెవరూ ఇలాంటి పిచ్చి పని చేయరు.ఇతడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media)లో వైరల్గా మారింది.
ఆ వ్యక్తి అదే ట్రాక్ పైన రైలు వస్తున్నా, చీమ కూడా కుట్టనట్లు గొడుగు పట్టుకొని నిద్రపోతున్నాడు.కానీ అదృష్టవశాత్తు ఆ వ్యక్తిని రైలు ఢీకొట్టలేదు.
అతన్ని లోకో పైలట్ కాపాడారు.ఇదీ వైరల్ వీడియోలో కనిపించింది.
రైలు డ్రైవర్ ఆ వ్యక్తి రైలు పట్టాలపై నిద్రిస్తున్నట్లు గమనించగానే రైలును ఆపాడు.ఆ వ్యక్తిని లేపి, పట్టాల నుంచి సురక్షితంగా పక్కకు పంపించాడు.ఆ తర్వాత రైలు తిరిగి ప్రయాణం మొదలుపెట్టింది.ఈ ఘటన ప్రయాగ్రాజ్ జిల్లాలోని మౌ ఐమ్మ ప్రాంతంలో జరిగింది. రైలు డ్రైవర్ హారన్ కొట్టినా ఆ వ్యక్తి లేవకపోవడంతో, ఆయన మానవత్వం ప్రదర్శించి రైలు దిగి వెళ్లి ఆ వ్యక్తిని లేపాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత, చాలామంది రైలు డ్రైవర్ను ప్రశంసించారు.“ఇలాంటి లోకో పైలట్( Loco Pilot )కు నమస్కారం.ఆయన రైలును ఆపి, ఆ వ్యక్తిని లేపి, పట్టాల నుంచి కాపాడారు.” అని వారు రాశారు.అదే సమయంలో, రైలు పట్టాలపై నిద్రపోయిన వ్యక్తిని కొంతమంది తీవ్రంగా తిట్టారు.
లోకో పైలట్ ట్రైన్ ఆపకపోతే అతడి తల నుజ్జునుజ్జు అయి ఉండేదేమో అని పేర్కొన్నారు.కొంతమంది అతను హోమ్ లెస్ పర్సన్ అనుకున్నారు.అతను ఎందుకు పట్టాలపై నిద్రపోయాడో అని ఆలోచిస్తూ అతనిపై జాలిపడ్డారు.