ముంబై: మందుబాబులను చీపుర్లతో వీర బాదుడు బాదిన మహిళలు.. ఎందుకంటే..?

నేరాలు జరగడానికి ప్రధాన కారణాల్లో మందు తాగడం కూడా ఒకటి.ఇండియాలో ఆల్కహాల్ తాగే మానప్రాణాలను తీసే వారి సంఖ్య పెరుగుతోంది.

 Mumbai: The Women Who Beat The Drug Lords With Brooms.. Because , Mumbai Streets-TeluguStop.com

మంది మందు తాగి పబ్లిక్ లోకి వచ్చి దారుణాలకు పాల్పడుతున్నారు.అయితే తాజాగా కొందరు గృహిణులు ఇలాంటి వారి భారతం పట్టారు.

ముంబై నగరానికి చెందిన ఆ మహిళలు రోడ్డు మీదే మందు తాగుతూ తూలుతున్న వారిని చూసి చాలా కోపగించుకున్నారు.వీళ్లు రోజూ తాగుతూ, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారట.

దాంతో ఈ మహిళలు తమ చేతులతోనే సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు.వారందరూ చేతుల్లో చీపురు పట్టుకొని మందుబాబులను వీర బాదుడు బాదారు.

ముంబై( Mumbai ) నగరం, కండివాలిలోని లాల్జీ పద ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.చాలా మంది ఈ మహిళలను ప్రశంసిస్తున్నారు.సమాజం కోసం, ప్రజల మంచి కోసం వారు చేసిన ఈ పనిని అందరూ అభినందిస్తున్నారు.

సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, ఈ మహిళలు చేతిలో చీపురుతో తాగుబోతుల వద్దకు వెళ్లారు.తాగుతున్న వారిని చూడగానే వారిని చీపురుతో కొట్టి, ఆ ప్రాంతం నుంచి వెళ్లగొట్టారు.సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోపై రకరకాల కామెంట్లు చేశారు.“ఇది చాలా బాగుంది.మరాఠీ మహిళ( woman)లకు ఏది సరైనదో మరియు తమ కోసం ఎలా నిలబడాలో తెలుసు.వారు బలంగా ఉంటారు, నిస్సహాయంగా ఉంటారు-అదే మరాఠా స్ఫూర్తి.” అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.మరికొందరు మహిళలను ప్రశంసించారు, ఇది నిజమైన “మహిళా సాధికారత”, “మహిళల శక్తి” అని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube