సుడిగాలి సుధీర్.బుల్లితెరపై ఓ రేంజిలో క్రేజ్ సంపాదించుకున్న నటుడు.
ఒకప్పుడు ఓ సాధారణ మెజీషియన్ గా ఉన్న సుధీర్.ఎన్నో ఇబ్బందులు పడ్డాడు.
తినడానికి తిండిలేక.ఖాళీ కడుపుతో పడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి అంటాడు ఈ నటుడు.
ప్రస్తుతం చక్కటి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.అంతేకాదు.
హీరోగా మారి సినిమాలు కూడా చేశాడు.సుడిగాలి ఎదుగుదల వెనుక ఎంతో శ్రమ ఉంది.
ఒకప్పుడు జీరో స్థాయిలో ఉన్న సుధీర్.ప్రస్తుతం కమెడియన్ గా.యాంకర్ గా.హీరోగా సత్తా చాటుతున్నాడు.దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే విధంగా డబ్బులు కూడా బాగానే సంపాదిస్తున్నాడు.
జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సుధీర్.
గడిచిన ఏడు సంవత్సరాలుగా చక్కటి కామెడీతో జనాలను నవ్విస్తున్నాడు.ఆయన టీం చేసే కామెడీని చూసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నవ్వని జనాలు లేరని చెప్పుకోవచ్చు.
కొద్ది రోజుల క్రితం సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమాలో హీరోగా నటించి జనాలను ఆకట్టుకున్నాడు.అటు పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ పోషిస్తూ అలరిస్తున్నాడు.
ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరపైగా దుమ్మురేపుతున్నాడు సుధీర్.అటు రెమ్యునరేషన్ విషయంలోనూ బాగా డిమాండింగ్ గానే ఉన్నాడు సుధీర్.
ఇప్పటికే ఆయన బాగానే ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది.

తాజాగా హైదరాబాద్ లో సుధీర్ ఓ ప్రాపర్టీ తీసుకున్నట్లు తెలుస్తుంది.ఆయన ఆస్తుల విలువ సుమారు రూ.5 కోట్లు ఉంటున్నట్లు సమాచారం.ఏడాదికి సుమారు 40 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ డబ్బులతో హైదరాబాద్ లో ఆస్తులు కొంటున్నట్లు టాక్.ఇప్పటికే తనకు భాగ్యనగరంలో రెండు ఇండ్లు ఉన్నాయి.స్థిరాస్తులు కూడా బాగానే కూడబెడుతున్నాడట.
ఒకప్పుడు తిండికోసం తిప్పలు పడ్డ సుధీర్ ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోవడం పట్ల తోటి నటులు చాలా సంతోషంగా ఫీలవుతున్నారట.ఆయన కష్టమే ఈ రోజు తనను ఈ పొజిషన్ కు తీసుకొచ్చిందంటున్నారు.