నాచురల్ స్టార్ నాని( Nani ) కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.నాని పారితోషికం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.
మరో మూడు రోజుల్లో సరిపోదా శనివారం( Saripodhaa Sanivaaram ) సినిమాతో నాని ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది.
అయితే నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో గతంలో తెరకెక్కిన అంటే సుందరానికి( Ante Sundaraniki ) సినిమా భారీ రన్ టైమ్ తో తెరకెక్కడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.
అయితే సరిపోదా శనివారం సినిమా విషయంలో సైతం అదే తప్పు జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.సరిపోదా శనివారం మూవీ 2 గంటల 50 నిమిషాల నిడివితో తెరకెక్కింది.
సరిపోదా శనివారం సినిమా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతుండగా నాని పాత్ర హైలెట్ గా నిలిచేలా ఈ సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది.నానికి జోడీగా ప్రియాంక మోహన్( Priyanka Mohan ) నటించగా ఆమె ఈ సినిమాలో ఎస్జే సూర్య విలన్ గా నటించడం ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.నాని ఎస్జే సూర్య( SJ Surya ) కాంబినేషన్ సీన్స్ హైలెట్ గా నిలిచేలా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.
అయితే రెండున్నర గంటల నిడివితో ఈ సినిమా విడుదలై ఉంటే బాగుండేదని నాని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.విజువల్ వండర్ గా తెరకెక్కిన సినిమాలకు భారీ రన్ టైమ్ కరెక్ట్ కానీ మాస్ సినిమాలకు ఇంత రన్ టైమ్ సరికాదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.నాని సినిమాలు హిట్ అవుతున్నా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు రావడం లేదు.
ఈ విషయాలపై నాని ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది.