సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు చిరంజీవి ( Chiranjeevi ) కొత్త వారిని ఎంతగానో ప్రోత్సహిస్తారనే సంగతి మనకు తెలిసిందే.ఏదైనా ఒక కొత్త సినిమా విడుదలవుతుంది అంటే ఈయన తన చేతుల మీదుగా ట్రైలర్ టీజర్ లాంచ్ చేస్తూ ఆ సినిమాలకు సపోర్ట్ ఇస్తూ ఉంటారు అంతేకాకుండా కొత్త సినిమాలను చూసి ఆ సినిమా పట్ల తన అభిప్రాయాన్ని స్వయంగా వారికి ఫోన్ చేసి చెప్పడం లేదా సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు చేయడం వంటివి కూడా చేస్తూ ఉంటారు.
ఇలా కొత్త వారిని చిరంజీవి ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారనే సంగతి తెలిసిందే.
ఇకపోతే తాజాగా నాని ( Nani ) నటించిన సినిమా గురించి చిరంజీవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం నాని సరిపోదా శనివారం( Saripoda Shanivaaram ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా ఆగస్టు 29వ తేదీ విడుదల కానుంది.
ఈ తరుణంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాని మాట్లాడుతూ నా ప్రతి ఒక్క సినిమాని మెగాస్టార్ చిరంజీవి గారు తప్పకుండా చూస్తారట అయితే శ్యాం సింగరాయ్( Shyam Singarai ) సినిమా పూర్వజన్మల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఈ సినిమా టాక్ పరంగా బానే ఉన్నప్పటికీ కలెక్షన్ల పరంగా నిర్మాతలకు నష్టాలను తీసుకు వచ్చింది.
ఇకపోతే ఈ సినిమా చిరంజీవి గారికి చాలా విపరీతంగా నచ్చిందని ఇదే విషయాన్ని స్వయంగా చిరంజీవి గారు నాతో చెప్పినట్టు నాని వెల్లడించారు.చిరంజీవి గారు సురేఖ గారు ఇద్దరు హోమ్ థియేటర్లో ఈ సినిమాని చూస్తూ లీనమైపోయారట మధ్యలో సిబ్బంది స్నాక్స్ తీసుకొని వెళ్ళి డిస్టర్బ్ చేయడంతో ఎందుకు డిస్టర్బ్ చేశార అంటూ వారిని తిట్టి మరి పంపించారని ఈ సినిమా చిరంజీవి గారికి అంత బాగా నచ్చింది అంటూ నాని ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.