టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో నటుడు మహేష్ బాబు( Mahesh Babu ) ఒకరు.ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక త్వరలోనే రాజమౌళి సినిమాతో మహేష్ బాబు బిజీ కాబోతున్నారు.ఇక ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు కూడా ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమా అతి తొందరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.ఇదిలా ఉండగా మహేష్ బాబు పిల్లలు సితార గౌతం ఇద్దరు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు ఇక వీరిద్దరూ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే గౌతమ్ సితార ఇద్దరు కూడా ఇండస్ట్రీలోకి రావడం కోసం విదేశాలలో యాక్టింగ్ కోర్స్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.ఈ విధంగా గౌతమ్ సితార త్వరలోనే హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సితార( Sitara ) తమ కెరియర్ గురించి అలాగే తన తండ్రి సినిమాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.తన తండ్రి నటించిన ఖలేజా సినిమా( Khaleja Movie ) అంటే తనకు చాలా ఇష్టం అని సితార తెలిపారు.
ఇకపోతే సితారకు ఇష్టమైన హీరో హీరోయిన్లు ఎవరో అనే విషయం గురించి కూడా ఈ సందర్భంగా యాంకర్ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఈమె తనకు తన తండ్రి మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని తెలిపారు.అంతేకాకుండా హీరోయిన్స్ గురించి కూడా ఈమె సమాధానం చెబుతూ తనకు రష్మిక,( Rashmika ) శ్రీ లీల( Sreeleela ) ఇద్దరు ఫేవరెట్ అని తెలిపారు.ఇక రష్మిక శ్రీ లీల ఇద్దరు కూడా తన తండ్రి మహేష్ బాబుతో కలిసి సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.
రష్మిక మహేష్ బాబు కాంబినేషన్లో సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఇక గుంటూరు కారం సినిమా ద్వారా శ్రీ లీల మహేష్ బాబు జోడిగా నటించి మెప్పించారు.