బీఆర్ఎస్ లో ఈ మార్పులు... ఇక తీరుగులేదా ? 

ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీకి( BRS ) మళ్లీ పునర్వైభవం  తీసుకువచ్చేందుకు,  పార్టీ నేతల్లో జోష్ నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కెసిఆర్( KCR ) కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు .ఈ మేరకు పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేపట్టేందుకు కసరత్తు మొదలుపెట్టారు.

 Kcr To Reconstruct Brs Party Gave Key Responsibilities To Leaders Details, Kcr,-TeluguStop.com

  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెంది ఎనిమిది నెలల తరువాత పూర్తిస్థాయిలో పార్టీ పునర్నిర్మాణం పై కేసీఆర్ ఫోకస్ చేశారు.బీఆర్ఎస్ ను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసి , వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే విధంగా , ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల పనితీరు ఏ విధంగా ఉంది అనేది అధ్యయనం చేస్తున్నారు.

Telugu Brs, Hareesh Rao, Pallarajeshwar, Ravulachandra, Telangana-Politics

ఈ మేరకు పార్టీ శ్రేణుల్లో ఉద్యమ పంథా ను పెంచడంతో పాటు,  రాజకీయ వ్యూహ రచనలు చేస్తున్నారు.ఈ మేరకు క్షేత్రస్థాయి నుంచి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.  బిఆర్ఎస్ ను పూర్తిస్థాయిలో ప్రాంతీయ పార్టీగా తయారుచేసి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం చేస్తున్నారు .ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి వలసల జోరు ఎక్కువైంది.  మరోవైపు చూస్తే ఎన్నికల సమయం దగ్గర పడింది .అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో కూరుకుపోయిన కార్యకర్తలలో ఉత్సాహం పెంచే విధంగా ,  భీఆర్ఏస్ ను టార్గెట్ చేసుకుని దూకుడుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్( Congress ) స్పీడుకు బ్రేకులు వేసే విధంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ మేరకు బీఆర్ఎస్  కేంద్ర కార్యాలయం నుంచి ప్రక్షాళన మొదలుపెట్టారు.ఈ మేరకు పార్టీ కీలక నేత,  తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ అయిన రావుల చంద్రశేఖర్ రెడ్డికి( Ravula Chandra Sekar Reddy ) పార్టీ కార్యాలయ కార్యదర్శి గా కీలక బాధ్యతలు అప్పగించారట.

Telugu Brs, Hareesh Rao, Pallarajeshwar, Ravulachandra, Telangana-Politics

అలాగే పార్టీలో కీలక నేతలుగా ఉన్న హరీష్ రావుకు( Harish Rao ) తెలంగాణ వ్యవహారాలను,  కేటీఆర్ కు( KTR ) సెంట్రల్ తెలంగాణ పార్టీ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఇక మరో సీనియర్ నేత ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డికి దక్షిణ తెలంగాణ బాధ్యతలు అప్పగించి మూడు ప్రాంతాలకు ముగ్గురు ఇన్చార్జీలను నియమించాలనే  ప్లాన్ లో కేసీఆర్ ఉన్నారట.తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఉద్యమ పార్టీ గా బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో  పార్టీ వ్యవస్థాపకత నిర్మాణంపై పెద్దగా దృష్టి పెట్టలేదనే అభిప్రాయం ఉంది.దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లాల్లో ఓటమికి ఎవరిని బాధ్యులను చేయాలో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

క్షేత్రస్థాయిలో పార్టీలో లోటుపాట్లను తెలుసుకునే యంత్రాంగం లేకపోవడంతో,  ఎక్కువగా పోలీస్ , ఇంటిలిజెన్స్ పై ఆధారపడడం వల్ల పార్టీలో ఏం జరుగుతుందనే ఖచ్చిత సమాచారం తెలియకపోవడం కూడా ఓటమికి కారణంగా కేసీఆర్ గుర్తించారు.దీంతోనే ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన డిఎంకె ఏఐఏడీఎంకే తృణమూల్ కాంగ్రెస్ బిజెపి పార్టీల పనితీరు వ్యవస్థాగత నిర్మాణాలను అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube