వాల్నట్స్ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.ఎన్నో పోషకాలు నిండి ఉన్న వాల్నట్స్.
జ్ఞాపక శక్తిని పెంచడంలోనూ, అధిక బరువును తగ్గించడంలోనూ, గుండె సంబంధిత జబ్బులు దూరం చేయడంలోనూ, ప్రాణాంతక వ్యాధి అయిన క్యాన్సర్ నుంచి రక్షించడంలోనూ అద్భుతంగా సహాయపడతాయి.అలాగే సౌందర్య పరంగా కూడా వాల్నట్స్ ఉపయోగపడుతాయి.
ముఖ్యంగా వాల్నట్స్ ద్వారా తయారు చేసే ఆయిల్‌తో ముడతలు, నల్ల మచ్చలు, మొటిమలు మరియు ఇతర సమస్యలను సులువుగా నివారించుకోవచ్చు.మరి వాల్నట్ ఆయిల్‌ను ఎలా యూజ్ చేయాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని.అందులో కొద్దిగా వాల్నట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.కాసేపు మసాజ్ చేసుకోవాలి.
బాగా ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒకసారి చేయడం వల్ల ముఖంపై నల్ల మచ్చలతో పాటు ముడతలు కూడా పోయి యవ్వనంగా మారుతుంది.

అలాగే చాలా మంది కళ్ల చుట్టూ నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతుంటారు.అధిక ఒత్తిడి కారణంగా నల్లటి వలయాలు ఎక్కువగా ఏర్పడతాయి.అయితే ఇవి పోగొట్టుకునేందుకు వాల్నట్ ఆయిల్ గ్రేట్‌గా సహాయపడుతుంది.వాల్నట్ ఆయిల్‌ను కళ్ల చుట్టూ నెమ్మదిగా అప్లై చేయాలి.ఇలా ప్రతి రోజు నిద్రంచే ముందు చేస్తే నల్లటి వలయాలు క్రమంగా తగ్గిపోతాయి.
ఇక ఒక బౌల్‌లో వాల్నట్ ఆయిల్ మరియు బాదం సమానంగా తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు ఆరనివ్వాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల.
ముఖంపై మొటిమలు పోయి ప్రకాశవంతంగా మారుతుంది.