పాకిస్థానీ ఇన్‌ఫ్లుయెన్సర్( Pakistani influencer ) చేసిన ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.ఫుడ్ వ్లాగర్ సోహైబ్ ఉల్లా యూసఫ్‌జాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఒక వ్యక్తి ఏకంగా 12 అడుగుల పొడవైన రోటీ తయారుచేస్తుండటం చూడొచ్చు.
దీన్ని “ప్రపంచంలోనే అతిపెద్ద రోటీ, 12 అడుగులు” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు.ఈ వీడియోను ఇప్పటివరకు 13.3 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ వీడియో చూసిన నెటిజన్లు అయితే షాక్ అవుతున్నారు.
ఈ వీడియో మొదలవ్వగానే ఒక వ్యక్తి భారీగా చేసిన పిండి ముద్దను ఒక పెద్ద సిలిండర్( cylinder ) ఆకారంలో ఉన్న పెనం మీద చాలా జాగ్రత్తగా పరచడం మనం చూడవచ్చు.ఆ పెనం కింద మంట ఉంటుంది, దాని వేడికి ఆ రోటీ మంచిగా కాలుతుంది.
రోటీ కాలిన తర్వాత, దానిని పక్కనే ఉన్న పెద్ద రొట్టెల కుప్పలో వేస్తారు.ఆ తర్వాత మరో పిండి ముద్దను చేతులతోనే సాగదీసి మళ్లీ అదే పద్ధతిలో కాల్చడం మనం గమనించవచ్చు.
ఈ రోటీ సైజు చూస్తే మాత్రం ఎవరికైనా కళ్లు తిరగాల్సిందే.
ఈ వీడియోను ఇంత ప్రత్యేకంగా నిలబెట్టింది ఆ రోటీని తయారుచేసే విధానం. సాధారణంగా రోటీలను పెనం మీద లేదా తవా మీద చేస్తారు.కానీ ఇక్కడ మాత్రం ఒక సిలిండర్ ఆకారంలో ఉన్న పెనాన్ని వాడుతున్నారు.
అంతేకాదు, ఈ రోటీని చేయడానికి కర్రను కూడా వాడకుండా కేవలం చేతుల్తోనే చేస్తున్నారు.ఇంత పెద్ద రోటీని, ఇలాంటి విచిత్రమైన పద్ధతిలో చేస్తుంటే చూడటానికి రెండు కళ్లూ చాలవు అంటున్నారు నెటిజన్లు.
ఈ వీడియో కింద కామెంట్స్ చూస్తే నవ్వు ఆపుకోలేరు.ఒక యూజర్ ఫన్నీగా కామెంట్ చేస్తూ, “ఇదిగో చూడండి.రోటీ కాలుస్తుంటే అతని గుడ్డలు, మొహం, కాళ్లు, జుట్టు అన్నింటికీ తగులుతోంది.అదే అసలైన రుచి” అని హిలేరియస్ కామెంట్ పెట్టాడు.ఇంకొకరు అయితే “ఇది చేత్తో చేసింది మాత్రమే కాదు, కాలితో కూడా చేసినట్టే ఉంది” అంటూ మరొకరు నవ్వు తెప్పించారు.కొందరు ఈ రోటీలను దుప్పట్లతో పోల్చుతుంటే, మరికొందరు వాటి కేలరీల గురించి తెగ ఆలోచిస్తున్నారు.
ఈ భారీ రొట్టెల వెనుక ఉన్న స్టోరీని వ్లాగర్ వివరించారు.ఇవి పెళ్లిళ్లలో చేసే ప్రత్యేకమైన వంటకమని చెప్పారు.
వీటిని చాలా శ్రద్ధతో తయారుచేసి, రుచికరమైన కూరలు, స్వీట్లతో కలిపి అతిథులకు విందు భోజనంలా వడ్డిస్తారని తెలిపారు.మొత్తానికి ఈ వీడియో నవ్వులు పంచుతూనే, వంటల ప్రపంచంలో ఉన్న సృజనాత్మకతకు, నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.