నిజ్జర్ హత్య కేసు : ఆ నలుగురు భారతీయులు కస్టడీలోనే, మళ్లీ నోరు పారేసుకున్న కెనడా

ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ ( Hardeep Singh Nijjar )హత్య కేసుకు సంబంధించి కెనడా మరోసారి నోరు పారేసుకుంది.ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు భారతీయులకు న్యాయస్థానం ఇటీవల బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే.

 Nijjar Murder Accused Still In Mandatory Detention Says Canada Govt , Canada ,-TeluguStop.com

అయితే ఈ నలుగురు ప్రస్తుతం బ్రిటీష్ కొలంబియా కోర్టు జారీ చేసిన తప్పనిసరి నిర్బంధ ఉత్తర్వులకు లోబడి ఉన్నారని కెనడా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

నలుగురు నిందితులపై కోర్టు తప్పనిసరి నిర్బంధ ఉత్తర్వులు విధించిందని.

వారు కస్టడీలోనే ఉన్నారని బ్రిటీష్ కొలంబియా ప్రాసిక్యూషన్ సర్వీస్ యాక్టింగ్ కమ్యూనికేషన్స్ కౌన్సెల్ సేమౌర్ తెలిపారు.బెయిల్ విచారణపై ఎలాంటి షెడ్యూల్ చేయలేదన్నారు.నలుగురు భారతీయ పౌరులను విడుదల చేసినట్లుగా వస్తున్న కథనాలను సేమౌర్ ఖండించారు.తదుపరి ఆదేశాల వరకు వారు నిర్బంధంలో ఉన్నారని ఆయన తెలిపారు.

అయితే కోర్టు తర్వాతి రోజుల్లో బెయిల్ దరఖాస్తును సమీక్షించవచ్చని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Telugu Canada, Canadianprime, Hardeepsingh, Mandatory, Nijjar, Nijjarmandatory-T

కాగా.2023 జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో హర్దీప్ సింగ్ నిజ్జర్‌‌ దారుణహత్యకు గురయ్యాడు. గురునానక్ సింగ్( Guru Nanak Singh ) గురుద్వారా సాహిబ్ పార్కింగ్ ప్లేస్‌లో అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

ఈ ఘటన భారత్ – కెనడాలలో తీవ్ర దుమారం రేపగా.ఖలిస్తాన్ మద్ధతుదారులు భగ్గుమన్నారు.దీని వెనుక భారత ప్రభుత్వం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ( Canadian Prime Minister Justin Trudeau )చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపాయి.

Telugu Canada, Canadianprime, Hardeepsingh, Mandatory, Nijjar, Nijjarmandatory-T

నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కరణ్ బ్రార్ (22), కమల్ ప్రీత్ సింగ్ (22), కరణ్ ప్రీత్ సింగ్ (28), అమన్‌దీప్ సింగ్ (22)లను గతేడాది మేలో కెనడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.గత కొద్దిరోజులుగా జైలు శిక్షను అనుభవిస్తున్న ఈ నలుగురికి దిగువ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పాటు విచారణను బ్రిటీష్ కొలంబియా సుప్రీంకోర్టుకు బదిలీ చేసింది.అలాగే తదుపరి విచారణను ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube