మతిమరుపు.వృద్ధాప్యంలో వచ్చే ఈ సమస్య నేటి కాలంలో ముప్పై, నలబై ఎళ్లకే ఎదుర్కొంటున్నారు.ప్రతి రోజూ ఏదో విషయాన్ని మరిచిపోతూ ఉంటారు.అయితే ఈ సమస్యను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.ఎందుకంటే, మతిమరుపు సమస్య చాలా నెమ్మదిగా ప్రారంభమై.చివరకు తీవ్రంగా మారిపోతుంటుంది.
అందుకే ముందు నుంచే జాగ్రత్తలు వహించాలి.అయితే మతిమరుపును తగ్గించడంలో కంద గ్రేట్‌గా సహాయపడుతుంది.
దుంప జాతికి చెందిన కంద.కనీసం వారినికి ఒకసారి తీసుకోవాలి.

అలా తీసుకోవడం వల్ల కందలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు మతిమరుపు సమస్యను తగ్గించి.జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది.కంద దుంపతో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.మధుమేహం ఉన్న వారు కంద దుంప తీసుకుంటే చాలా మంచిది.కంద దుంప వండుకుని తీసుకుంటే.రక్తంలోని చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి.
కంద దుంపలో ఉండే ఎ, సి విటమిన్లు శరీర రోగ నిరోధక శక్తి పెంచడంతో పాటు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.కంద దుంపలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
కాబట్టి, కంద తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.ముఖ్యంగా మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఫైబర్ ఉండే ఏ ఆహారమైనా బరువును తగ్గించగలదు.కాబట్టి, కంద తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు.

అలాగే కంద దుంప తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం పాటు యాక్టివ్‌గా ఉండగలరు.మరియు కందలో ఉండే పోషకాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి.గుండె జబ్బులను దూరం చేస్తుంది.ఇక జుట్టు అధికంగా రాలిపోతుందని బాధ పడుతున్న వారు.ఖచ్చితంగా కందను డైట్‌లో చేర్చుకోవాలి.ఎందుకంటే, కందలో ఉండే విటమిన్ బీ6, బీటా కెరొటిన్ వంటి ఖనిజాలు శిరోజాలను ఒత్తుగా, దృఢంగా మారుస్తాయి.