కోపం వచ్చి ఇంటర్ సర్టిఫికెట్ తగలబెట్టాను.. దసరా దర్శకుడు చెప్పిన విషయాలివే!

వివేక ఆత్రేయ( Viveka Atreya ) దర్శకత్వం వహించిన తాజా చిత్రం సరిపోదా శనివారం( Saripoda sanivaram ).ఈ సినిమాలో నాని హీరోగా నటించిన విషయం తెలిసిందే.

 Srikanth Odela Shares His Opinion On Saripodha Shanivaram Event, Srikanth Odela,-TeluguStop.com

ఇందులో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటించింది.అలాగే త‌మిళ న‌టుడు ఎస్‍జే సూర్య కీలక పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ చిత్రం ఆగ‌ష్టు 29న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే.

ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.తాజాగా కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వ‌హించారు మూవీ మేక‌ర్స్.

Telugu Pre, Srikanth Odela, Srikanthodela, Tollywod-Movie

ఈ వేడుకకు దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ( Director Srikanth Odela )గెస్ట్ గా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన ఒక అరుదైన సంఘటనను అభిమానులతో పంచుకున్నారు.ఈ మేరకు శ్రీకాంత్ మాట్లాడుతూ.నాకు దర్శకుడు వివేక ఆత్రేయ అంటే చాలా ఇష్టం.అతని సినిమాలు మనతో మాట్లాడతాయి.నేను మొదటి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను.

ఇంటర్ పాస్ అయితే మా నాన్న బీటెక్ చేయిద్దాం అనుకున్నాడు.అందుకే కావాలని నేను ఒక సబ్జెక్టు ఆపాను.

ఆ తర్వాత ఫిలిం స్కూల్లో జాయిన్ కావాలి అంటే ఇంటర్ పాస్ అవ్వాలని తెలిసింది.దీంతో ఇంటర్ పాస్ అయ్యే ఫిలిం స్కూల్లో జాయిన్ అయ్యాను.

Telugu Pre, Srikanth Odela, Srikanthodela, Tollywod-Movie

అయితే అక్క‌డ కూడా ఫెయిల్ అయ్యాను.అయితే ఇంట‌ర్ పాస్ అయినందుకు న‌న్ను బీటెక్ చేయిద్దాం అని మ‌ళ్లీ మా నాన్న బాబాయి ప‌ట్టుబట్టారు.క‌నీసం డిగ్రీ అయిన జాయిన్ అవ్వు అంటూ అన్నారు.వీళ్లంద‌రు న‌న్ను ఎందుకు జాయిన్ అవ్వ‌మంటున్నారు.నా ద‌గ్గ‌ర ఇంట‌ర్ సర్టిఫికెట్ ఉంది అనే కదా అని ఒక రోజు కోపం వ‌చ్చి నా ఇంట‌ర్, టెన్త్, 7వ త‌ర‌గ‌తి సర్టిఫికెట్లు త‌గ‌ల‌బెట్టాను.అయితే వివేక్ తీసిన బ్రోచేవారెవరురా సినిమాలో కూడా ఇలాంటి సీన్ ఉంటుంది.

ఇది చూసి ఇడేవాడురా బాబు సేమ్ నా సీనే రాసిండు అనుకున్నాను అంటూ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.కాగా ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube