నల్లగొండ జిల్లా:ఎగువ నుండి వరద ఉధృతి పెరగడంతో నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది.దీనితో ఆదివారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
వరద ఇలాగే కొనసాగితే మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు సమాచారం.