టి.పీసీసీ పీఠం ఈ ఇద్దరిలో ఎవరికో ? 

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు( TPCC Chief ) ఎంపికపైనే కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది .ఇప్పటికే పిసిసి అధ్యక్షుడి ఎంపిక కు సంబంధించి ఒక క్లారిటీకి వచ్చినట్లు సమాచారం.

 Who Will Get Tpcc Chief Among Madhu Yaskhi Goud Mahesh Kumar Goud Details, Madhu-TeluguStop.com

అధికారికంగా త్వరలోనే ఆ పేరును ప్రకటించే అవకాశం ఉంది.రెండు రోజుల క్రితమే కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) భేటీ అయ్యారు.

సోనియా గాంధీ , రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే తో భేటీ అయ్యారు .కొత్త పిసిసి అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే విషయం పైన కసరత్తు చేశారు.  ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు.అయితే అటు పార్టీ , ఇటు ప్రభుత్వ బాధ్యతలను నిర్వహించడం కష్టతరంగా మారిన నేపథ్యంలో ఎప్పటి నుంచో పిసిసి అధ్యక్షుడిగా తనను తప్పించి, వేరొకరిని నియమించాలని అధిష్టానం పెద్దలను కోరుతూనే వస్తున్నారు.

దీంతో రేవంత్ స్థాయిలో సమర్ధుడైన నాయకుడి  కోసం కాంగ్రెస్ అధిష్టానం కూడా ఎప్పటి నుంచో కసరత్తు చేస్తుంది.

Telugu Sridhar Babu, Pcc, Revanth Reddy, Tcongress, Tpcc-Politics

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు,  పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీకి మరింత బలం చేకూర్చడంతో పాటు , అందరిని కలుపుకుపోయే వ్యక్తిని పిసిసి అధ్యక్షుడిగా నియమించాలని రేవంత్ ఇప్పటికే అధిష్టానం పెద్దలకు సూచించారు.దీంతో ఎవరికి ఈ పదవి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.ముఖ్యమంత్రి గా ఉన్న రేవంత్ రెడ్డి  రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి .ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క దళిత సామాజిక వర్గానికి చెందినవారు.దీంతో బీసీ సామాజిక వర్గానికి పిసిసి అధ్యక్ష పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతుంది.

ఈ నేపథ్యంలోనే  ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ,( Mahesh Kumar Goud ) మధు యాష్కీ గౌడ్( Madhu Yaskhi Goud ) పేర్లు వినిపిస్తున్నాయి.

Telugu Sridhar Babu, Pcc, Revanth Reddy, Tcongress, Tpcc-Politics

ఇందులో మధు యాష్కీ గౌడ్ కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.వీరిద్దరితో పాటు మంత్రి శ్రీధర్ బాబు పేరు వినిపిస్తోంది .ఈయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి .అత్యంత సౌమ్యుడు గాను ,అందరిని కలుపుకుపోయే వ్యక్తిగానూ గుర్తింపు పొందారు.  అయితే ఆయన బీఆర్ఎస్  , బిజెపిలను టార్గెట్ చేసుకుని విమర్శలు చేసే విషయంలో అంత దూకుడు ప్రదర్శించరని,  గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరించి బీ ఆర్ ఎస్ పై రాజీ లేని పోరాటం చేయడంతోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అధికారంలోకి వచ్చిందని,  ఆ స్థాయిలో పోరాడగలిగిన నాయకుడిని పిసిసి అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని చూస్తున్న క్రమంలో దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు పేరును పక్కన పెట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ లో ప్రచారం జరుగుతోంది.

దీంతో మహేష్ కుమార్ గౌడ్ లేదా మధు యాష్కీ గౌడ్ లలో ఒకరికి పిసిసి అధ్యక్ష పదవి దక్కే అవకాశం అన్నట్టుగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube