నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత... కొత్త కోడలి ఎఫెక్ట్ అంటూ ట్రోల్స్!

తెలంగాణ సర్కారు నాగార్జునకు ( Nagarjuna) బిగ్ షాక్ ఇచ్చింది.ఈయన ప్రభుత్వ స్థలంలో తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ (N Convention)  నిర్మించారు అంటూ అధికారులు నేడు ఉదయం ఈ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేసిన సంగతి మనకు తెలిసిందే.

 N Convention Center Demolition Issue Netizens Troll On Sobita, Nagarjuna, Nagach-TeluguStop.com

మాదాపూర్ లో 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ కన్వెన్షన్ సెంటర్ దాదాపు మూడున్నర ఎకరాల చెరువు స్థలాన్ని కబ్జా చేసి నిర్మించారని అధికారులు గుర్తించారు.దీంతో హైడ్రా ఆధ్వర్యంలో అధికారులు ఈ కట్టడాలను కూల్చి వేశారు.

ఇప్పటికే దాదాపు ఈ కన్వెన్షన్ సెంటర్ నేలమట్టం అయింది అయితే నాగార్జున కోర్టును ఆశ్రయించడంతో ఈ కూల్చివేతలు ఆపాలని ఉత్తర్వులు జారీ చేయడంతో నాగార్జునకు కొంతమేర ఉపశమనం కలిగింది.

Telugu Nagachaitanya, Nagarjuna-Movie

ఇకపోతే నాగార్జున గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను విజయవంతంగా నడిపిస్తున్నారు.ఈ కన్వెన్షన్ ద్వారా పెద్ద ఎత్తున లాభం పొందుతున్నారు అయితే ఒక్కసారిగా ఈ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేయడంతో ఈయనకు కోట్లలో నష్టం రావడమే కాకుండా ఇదంతా కూడా కొత్త కోడలి ఎఫెక్ట్ అంటూ నటి శోభితపై ట్రోల్స్ మొదలయ్యాయి. అక్కినేని నాగచైతన్య ( Nagachaitanya ) సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభితతో పెళ్లికి సిద్ధమయ్యారు.

Telugu Nagachaitanya, Nagarjuna-Movie

ఇలా శోభిత ( Sobhita ) అక్కినేని ఇంట కోడలుగా అడుగుపెట్టబోతున్న తరుణంలో నాగార్జునకు ఇది ఊహించని షాక్ అని ఇదంతా కూడా ఆమె లెగ్గు మహిమ అంటూ చాలామంది సమంత అభిమానులు అలాగే అక్కినేని యాంటీ ఫాన్స్ ఈ విషయంలో శోభిత పై ట్రోల్స్ చేస్తున్నారు.అయితే ఈ కన్వెన్షన్ వివాదం ఇప్పటిడి కాదని రేవంత్ రెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ అక్రమ కట్టడం గురించి ఆయన అసెంబ్లీలో మాట్లాడారు.కానీ అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.కానీ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపుతున్న సంగతి తెలిసిందే.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube