మాస్ మహారాజ రవితేజ( Raviteja ) హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మిస్టర్ బచ్చన్( Mr.Bachchan ).ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాప్ సొంతం చేసుకుందిఫస్ట్ డే నుంచి ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో పూర్తి స్థాయిలో కలెక్షన్స్ పడిపోవడమే కాకుండా నిర్మాతకు కోట్లలో నష్టం వచ్చిందని చెప్పాలి.డైరెక్టర్ హరీష్ శంకర్( Harish Shankar ) దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్( TG Vishwa Prasad ) ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇక ఈ సినిమా ద్వారా నిర్మాతకు భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయని తెలుస్తోంది.
ఇకపోతే ఈ సినిమాకి ఇలాంటి కలెక్షన్లు రావడానికి, ఇక ఈ సినిమా డిజాస్టర్ కావడానికి డైరెక్టర్ హరీష్ శంకర్ ( Harish Shankar )కారణమంటూ నిర్మాత విశ్వప్రసాద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనగా మారాయి.ఈ సినిమాకు హరీష్ శంకర్ నిర్వహించిన ప్రమోషన్స్ భారీగా దెబ్బతీసాయని తెలిపారు.హరీష్ శంకర్ ప్రమోషన్లలో భాగంగా చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాకు ప్రయోజనకరంగా మారడం ఏమో కానీ భారీ నష్టాన్ని తీసుకువచ్చాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది సెకండ్ హాఫ్ ఓకే అనుకున్నాము కానీ ఫస్ట్ హాఫ్ కాస్త ఎడిటింగ్ చేయడంతో మొత్తం పోయిందని అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిందని తెలిపారు.అంతేకాకుండా ఈ సినిమాలో హిందీ పాటలు ఏ మాత్రం సెట్ అవ్వడం లేదని విశ్వప్రసాద్ తెలిపారు.ఈ సినిమా ఒక ఎంటర్టైనింగ్ లాగా ఉంటుందని భావించాము కానీ ఇలాంటి రిజల్ట్ అందుకుంటుందని అసలు ఊహించలేదు అంటూ మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ గురించి నిర్మాత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ప్రమోషన్లలో భాగంగా హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ కూడా ఈ సినిమాకి మైనస్ అయ్యాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
.