తెలంగాణ సర్కారు నాగార్జునకు ( Nagarjuna) బిగ్ షాక్ ఇచ్చింది.ఈయన ప్రభుత్వ స్థలంలో తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ (N Convention) నిర్మించారు అంటూ అధికారులు నేడు ఉదయం ఈ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేసిన సంగతి మనకు తెలిసిందే.
మాదాపూర్ లో 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ కన్వెన్షన్ సెంటర్ దాదాపు మూడున్నర ఎకరాల చెరువు స్థలాన్ని కబ్జా చేసి నిర్మించారని అధికారులు గుర్తించారు.దీంతో హైడ్రా ఆధ్వర్యంలో అధికారులు ఈ కట్టడాలను కూల్చి వేశారు.
ఇప్పటికే దాదాపు ఈ కన్వెన్షన్ సెంటర్ నేలమట్టం అయింది అయితే నాగార్జున కోర్టును ఆశ్రయించడంతో ఈ కూల్చివేతలు ఆపాలని ఉత్తర్వులు జారీ చేయడంతో నాగార్జునకు కొంతమేర ఉపశమనం కలిగింది.
ఇకపోతే నాగార్జున గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను విజయవంతంగా నడిపిస్తున్నారు.ఈ కన్వెన్షన్ ద్వారా పెద్ద ఎత్తున లాభం పొందుతున్నారు అయితే ఒక్కసారిగా ఈ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేయడంతో ఈయనకు కోట్లలో నష్టం రావడమే కాకుండా ఇదంతా కూడా కొత్త కోడలి ఎఫెక్ట్ అంటూ నటి శోభితపై ట్రోల్స్ మొదలయ్యాయి. అక్కినేని నాగచైతన్య ( Nagachaitanya ) సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభితతో పెళ్లికి సిద్ధమయ్యారు.
ఇలా శోభిత ( Sobhita ) అక్కినేని ఇంట కోడలుగా అడుగుపెట్టబోతున్న తరుణంలో నాగార్జునకు ఇది ఊహించని షాక్ అని ఇదంతా కూడా ఆమె లెగ్గు మహిమ అంటూ చాలామంది సమంత అభిమానులు అలాగే అక్కినేని యాంటీ ఫాన్స్ ఈ విషయంలో శోభిత పై ట్రోల్స్ చేస్తున్నారు.అయితే ఈ కన్వెన్షన్ వివాదం ఇప్పటిడి కాదని రేవంత్ రెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ అక్రమ కట్టడం గురించి ఆయన అసెంబ్లీలో మాట్లాడారు.కానీ అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.కానీ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపుతున్న సంగతి తెలిసిందే.
.