1.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.గురువారం తిరుమల శ్రీవారిని 65,840 మంది భక్తులు దర్శించుకున్నారు.
2.14 నుంచి బండి సంజయ్ యాత్ర
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఈనెల 14 నుంచి రెండోదశ ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించనున్నారు.
3.కాళేశ్వరం లో కాగ్ పర్యటన
కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం బెయిల్పై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్ ) దృష్టి పెట్టింది ఈ మేరకు దీనిపై వివరాలను కాగా అధికారులు ఆరా తీశారు హైదరాబాద్ ఏజీ కార్యాలయానికి చెందిన అకౌంట్స్ అధికారులతో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించారు.నిర్మాణ అంచనా వ్యయం, సవరించిన అంచనాలు, బ్యారేజీ లోతు వంటి వివరాలు పరిశీలించారు.
4.ఢిల్లీలో సీఎం పి ఆర్ ఓ గా సంజయ్ కుమార్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఢిల్లీలో ప్రజాసంబంధాల అధికారి గా సంజయ్ కుమార్ నియమితులయ్యారు.
5.బీడీఎస్ యాజమాన్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్
ప్రైవేటు వైద్య కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జన్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీచేసింది.
6.నేడు నంద్యాలలో జగన్ పర్యటన
ఈరోజు ఏపీ సీఎం జగన్ నంద్యాలలో పర్యటించనున్నారు.
7.జగనన్న వసతి దీవెన
నేడు జగన్ అన్న వసతి దీవెన రెండో విడత నిధులు విడుదల కానున్నాయి.10,68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లు జమ చేయనున్నారు.
7.టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్లు
నేటి నుంచి టీటీడీ ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదల చేయనుంది.వృద్ధులు వికలాంగులకు ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేస్తారు.
8.నేటినుంచి రేషన్ పంపిణీ
ఏపీలో అన్ని జిల్లాలో నేటి నుంచి పేదలకు చౌకదుకాణాల్లో రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు.
9.నల్ల జెండాలతో టీఆర్ఎస్ నిరసన
ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ శుక్రవారం టిఆర్ఎస్ నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు రైతులు కార్యకర్తలపై నల్ల జెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు.
10.ఏపీ ఒడిశా లకు కార్చిచ్చు ముప్పు
వేసవి కారణంగా దేశమంతట అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి .దీంతో తీవ్రమైన సంభవించే అవకాశాలు ఉన్నాయని పర్యావరణ నీటి వనరుల పరిరక్షణ మండలి విడుదల చేసిన అధ్యయనం హెచ్చరికలు జారీ చేసింది.ముఖ్యంగా ఏపీలో తూర్పుగోదావరి, ఒడిషాలోని కందమూరు జిల్లాలకు కారుచిచ్చు ముప్పు ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
11.విద్యుత్ కోతలపై చంద్రబాబు ఆగ్రహం
ఏపీలో విద్యుత్ కోతలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన, విద్యుత్ కోతలతో ప్రసూతి ఆస్పత్రిలో బాలింతల పరిస్థితిని వివరిస్తూ వీడియోను జత చేశారు.
12.రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.రఘురామ అరెస్ట్ పై సిబిఐతో విచారణ చేయించాలని దాఖలైన పిటిషన్ పై స్పందించిన న్యాయస్థానం ఇదంతా ముఖ్యమైన విషయం అంటూ పిటిషనర్ ప్రశ్నించింది.
13.ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ పై నిషేధం
ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వహించే డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ నిర్వహించకుండా నిషేధం విధిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
14.టీటీడీ లో ఉద్యోగాలు
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్ కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆసక్తి కలిగినవారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
15.డ్రగ్స్ తీసుకున్న వారికి త్వరలో నోటీసులు
హైదరాబాద్లో డ్రగ్స్ వ్యవహారం సంచలనంగా మారింది డ్రగ్స్ తీసుకున్న వారికి పోలీసులు త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు.
16.గవర్నర్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన
తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ పై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పై గవర్నర్ ఆరోపణలపై స్పందించిన ఆయన, గవర్నర్ తో తమకు ఎలాంటి పంచాయతీ లేదని పేర్కొన్నారు.
17.గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
గత పది నెలలుగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు రాజ్ భవన్ కు రాలేదని, తాను ఆస్పత్రులను సందర్శించడం, ఎమ్మెల్సీ పదవికి కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆమోదించక పోవడంతోనే ప్రభుత్వ వర్గాలు ఇలా వ్యవహరిస్తున్నాయని, నేను తలుచుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయే ఉండేదని గవర్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
18.రిషబ్ పంత్ కు భారీ జరిమానా
లక్నో తో జరిగిన మ్యాచ్ లో లో రేటింగ్ కారణంగా ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ కు 12 లక్షలు జరిమానా విధించినట్లు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.
19.ట్రాఫిక్ హోం గార్డుని సత్కరించిన సీజే
తన విధులను చిత్తశుద్ధితో నిర్వహిస్తున్న హోంగార్డు అశ్రప్ అలీకి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ.ఈ సన్మాన కార్యక్రమం ఆబిడ్స్ లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద శుక్రవారం ఉదయం జరిగింది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,250 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -52,630
.