చిగుళ్ల వాపు.చాలా మందిని వేధించే కామన్ సమస్యల్లో ఇది ఒకటి.చిగుళ్ల వాపు కారణంగా ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు.ముఖ్యంగా ఏమైనా తినాలన్నా, తాగాలన్నా ఎంతో అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కా గనుక పాటిస్తే చిగుళ్ల వాపు సమస్య దూరం అవ్వడమే కాదు దంతాలు తెల్లగా సైతం మెరుస్తాయి.మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటి అన్నది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతుల పొడిని వేసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని స్పూన్ తో మిక్స్ చేయాలి.
ఇప్పుడు ఒకటిన్నర టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె, రెండు చుక్కలు పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిగుళ్ళు మరియు దంతాలపై అప్లై చేసి స్మూత్ గా వేళ్ళతో కాసేపు రబ్ చేసుకోవాలి.
అనంతరం బ్రష్ తో రెండు నుంచి మూడు నిమిషాల పాటు దంతాలను తోముకుని వాటర్ తో శుభ్రంగా నోటిని క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒక్కసారి గనుక ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే చిగుళ్ల వాపు నుంచి వేగంగా మరియు సులభంగా బయటపడొచ్చు.

అలాగే ఈ చిట్కాతో గార పట్టి పసుపు రంగులోకి మారిన దంతాలను సైతం వదిలించుకోవచ్చు.అవును, ఈ చిట్కాను తరచూ పాటిస్తే దంతాలు ముత్యాల మాదిరి తెల్లగా మెరిసిపోతాయి.కాబట్టి చిగుళ్ల వాపు తో బాధపడుతున్న వారే కాదు పసుపు దంతాలతో తీవ్రంగా సతమతం అవుతున్న వారు కూడా ఈ చిట్కాను తప్పకుండా ట్రై చేయండి.మంచి ఫలితాలు మీ సొంతం అవ్వడం ఖాయం.