టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి ( Kriti Shetty )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.
ఉప్పెన సినిమాతో ఉప్పెనలా దూసుకు వచ్చింది.ఉప్పెన సినిమా తర్వాత ఈమె మాచర్ల నియోజకవర్గం, కస్టడీ, బంగార్రాజు, ది వారియర్, శ్యామ్ సింగరాయ్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
ఈ సినిమాలు కృతి శెట్టికి పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయాయి.ఆ తర్వాత ఈమెకు నెమ్మదిగా సినిమా అవకాశాలు కరువయ్యాయి.
ప్రస్తుతం కేవలం అడపాదడపా సినిమాలలో మాత్రమే నటిస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో కృతిశెట్టికీ సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది.అదేమిటంటే చిరంజీవి( Chiranjeevi ) ప్రాజెక్టు హీరోయిన్ కృతి శెట్టి రిజెక్ట్ చేసిందని పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.అయితే తాజాగా ఈ వార్తలపై కృతి స్వయంగా స్పందించింది.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది.తనను ఎవరూ సంప్రదిచలేదని, కావాలనే ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారని ఆమె క్లారిటీ ఇచ్చింది.
ఇకపోతే ఈ ముద్దుగుమ్మ కెరియర్ విషయానికి వస్తే.
మొన్నటి వరకు తెలుగు తమిళ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కృతిశెట్టి ప్రస్తుతం మలయాళ సినిమా ఇండస్ట్రీలో బిజీబిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.టొవినో థామస్‌తో కలిసి అజయంతే రందం మోషణంఅనే చిత్రంలో నటిస్తోంది.సెప్టెంబర్ 12వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో కృతి ఈ విషయాలను వెల్లడించింది.