టెస్లాలో పని చేయడం చాలా కష్టం.. ఎన్నారై శ్రీల వెంకటరత్నం షాకింగ్ కామెంట్స్..?

ప్రముఖ అమెరికన్‌ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లాలో ఉద్యోగం చేయడం అంత ఈజీ కాదు.ఈ కంపెనీ తన కార్లను చాలా తక్కువ సమయంలో తయారు చేస్తుంది.

 Working In Tesla Is Very Difficult Nri Srila Venkataratnam's Shocking Comments,-TeluguStop.com

అలానే కార్లలో లాంగెస్ట్ రేంజ్ ఆఫర్ చేస్తుంది.ఇంకా అదిరిపోయే టెక్నాలజీతో కార్లను ఒక “కంప్యూటర్ ఆన్ రోడ్”గా మార్చేస్తుంది.

ఈ కార్ల క్వాలిటీ, క్వాంటిటీ పెరిగేకొద్దీ ఉద్యోగులపైనే భారం పడుతుంది.అందుకే ఇక్కడ పని చేయలేక చాలామంది రాజీనామా చేస్తున్నారు.

తాజాగా టెస్లా కంపెనీలో పదేళ్లకు పైగా వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన శ్రీల వెంకటరత్నం( Srila Venkataratnam ) తమ పదవికి రాజీనామా చేశారు.

టెస్లాలో( Tesla ) కేవలం ఇద్దరు మహిళా ఉపాధ్యక్షులు మాత్రమే ఉండగా, వారిలో ఒకరుగా ఉన్న శ్రీల తమ లింక్డ్ఇన్ పేజీలో ఈ వారం ప్రారంభంలో తమ నిర్ణయాన్ని ప్రకటించారు.

టెస్లా ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, అక్కడ పని చేయడం అంత సులభం కాదని ఆమె చెప్పారు.ఆమె టెస్లా కంపెనీలో( Tesla Company ) పనిచేస్తున్నప్పుడు, ఆ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుగా ఎదిగింది.“కంపెనీలో కేవలం ఇద్దరు మహిళా ఉపాధ్యక్షులలో ఒకరిగా, మనం కలిసి సాధించిన విజయాలపై నేను గర్విస్తున్నాను.నేను వెళ్లిపోయే సమయానికి, టెస్లా సంవత్సరానికి దాదాపు 100 బిలియన్ డాలర్ల ( 100 billion dollars )ఆదాయాన్ని ఆర్జించింది.

కంపెనీ విలువ 700 బిలియన్ డాలర్లు చేరుకుంది.ఒకే సంవత్సరంలో 18 లక్షల కార్లను అమ్ముడయ్యాయి.” అని శ్రీల పేర్కొన్నారు.

Telugu Faint Heart, Nri, Tesla, Tesladifficult-Telugu NRI

టెస్లా కంపెనీ మాజీ ఆర్థిక అధికారి జేసన్ వీలర్( Jason Wheeler ) శ్రీల వెంకటరత్నంను అభినందించినప్పుడు, ఆమె టెస్లాలో పని చేయడం ఎంత కష్టమో గుర్తు చేశారు.దానికి సమాధానంగా, శ్రీల టెస్లాలో పని చేయడం చాలా కష్టమైన పని అని మరోసారి చెప్పారు.ఇక టెస్లా కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్స్‌ తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు.

వీళ్ళలో కొందరు చాలా సంవత్సరాలుగా ఆ కంపెనీలో పని చేస్తున్నవారు కూడా ఉన్నారు.

Telugu Faint Heart, Nri, Tesla, Tesladifficult-Telugu NRI

టెస్లా మాజీ హెడ్ ఆఫ్ ప్రొడక్ట్ లాంచ్ రిచ్ ఒట్టో మాట్లాడుతూ టెస్లా కంపెనీ చాలా బాగున్నప్పటికీ, అక్కడ పని చేయడం చాలా కష్టమని చెప్పారు.కంపెనీలో చాలామంది ఉద్యోగులను తొలగించడం వల్ల, ఆ కంపెనీ ముందు ఎలా ఉంటుందో తెలియడం లేదని ఆయన పేర్కొన్నారు.మొత్తం మీద ఎలాన్ మస్క్ కంపెనీలో వర్క్ చేయడం చాలా హార్డ్ అనే విషయం అర్థమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube