రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టడం లేదా.. అయితే ఈ పోషకాల లోపం కావొచ్చు!

ఆరోగ్యమైన జీవితానికి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో కంటి నిండా నిద్రపోవడం కూడా అంతే ముఖ్యం.అందుకే కడుపునిండా తిండి.

 Deficiency Of These Nutrients Can Lead To Poor Sleep Details, Poor Sleep, Nutri-TeluguStop.com

కంటి నిండా నిద్ర అంటారు.ఈ రెండు సమపాళ్లలో ఉంటేనే జీవితం సాఫీగా సాగుతుంది.

అయితే ఇటీవల రోజుల్లో నిద్రలేమి( Insomnia ) కారణంగా బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.ఒత్తిడి, ఆందోళన, స్క్రీన్ టైమ్ అధికంగా ఉండటం వంటి అంశాలే కాదు కొన్ని పోషకాలు లోపించడం వల్ల కూడా కంటికి కునుకు కరువు అవుతుంది.

మంచి నిద్రకు మూడు పోషకాలు చాలా అవసరం.ఏ జాబితాలో పొటాషియం( Potassium ) గురించి మొదట చెప్పుకోవాలి.ఇది నాడులను కండరాలను నియంత్రిస్తుంది.శరీరంలో పొటాషియం లెవెల్స్ తగ్గినప్పుడు నిద్ర పట్టడం లో ఇబ్బందులు తలెత్తుతాయి.

కాబట్టి నైట్ సరిగ్గా నిద్ర పట్టడం లేదంటే అరటి, అవకాడో, ఆకుకూరలు, క్యారెట్, చిలగడదుంప వంటి పొటాషియం రిచ్ ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకోండి.

Telugu Sleep, Tips, Insomnia, Latest, Magnesium, Poor Sleep, Potassium, Vitamin-

అలాగే మెగ్నీషియం( Magnesium ) నిద్రను నియంత్రించే ప్రక్రియ లో కీలకపాత్రను పోషిస్తుంది.మెగ్నీషియం లోపం వల్ల తలెత్తే సమస్యల్లో నిద్రలేమి ఒకటి.మెగ్నీషియం కోసం పాలకూర, బాదం గింజలు, కొబ్బరి పాలు, బ్రెజిల్ న‌ట్స్‌, జీడిపప్పు, గుమ్మడి గింజలు, చియా సీడ్స్ వంటి ఆహారాల‌ను తీసుకోవచ్చు.

Telugu Sleep, Tips, Insomnia, Latest, Magnesium, Poor Sleep, Potassium, Vitamin-

ఇక విటమిన్ డి( Vitamin D ) లోపం కారణంగా కూడా రాత్రుళ్ళు నిద్ర పట్టదు.శరీరానికి విటమిన్ డి అందనప్పుడు నిస్సత్తువ, పగటిపూట మగత వంటి లక్షణాలు కనిపిస్తాయి.పగటిపూట నిద్ర పోతే రాత్రుళ్లు నిద్ర పట్టదు.పైగా విటమిన్ డి లోపం కారణంగా ఎముకలు బలహీనంగా మారతాయి.మరెన్నో సమస్యలు తలెత్తుతాయి.కాబట్టి విటమిన్ డి కోసం స‌న్‌రైజ్‌ కు ఎక్స్పోజ్ అవ్వండి.

విటమిన్ డి కోసం పుట్ట‌గొడుగులు, గుడ్లు, చేప‌లు, పాలు మ‌రియు పాల‌ ఉత్ప‌త్తులు తీసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube