ఈ కాఫీ క్రీమ్ తో కళ్ళ చుట్టూ నలుపును పది రోజుల్లో వదిలించుకోవచ్చు!

అధిక ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, గంటల తరబడి ఫోన్, టీవీలు చూడ‌టం వంటి కారణాల వల్ల చాలా మందికి కళ్ళ చుట్టూ నలుపు( Dark Circles ) ఏర్పడుతుంది.దీన్నే డార్క్ సర్కిల్స్ అంటాము.

 Get Rid Of Dark Circles Around The Eyes In Ten Days With This Coffee Cream Detai-TeluguStop.com

డార్క్ సర్కిల్స్ కారణంగా ముఖంలో మెరుపు మాయమవుతుంది.అందంగా కనిపించాల్సిన వారు అందవిహీనంగా క‌నిపిస్తారు.

ఈ క్రమంలోనే డార్క్ సర్కిల్స్ ను వదిలించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే కాఫీ క్రీమ్( Coffee Cream ) చాలా బాగా సహాయపడుతుంది.

ఈ క్రీమ్ ను తయారు చేసుకుని రెగ్యులర్ గా వాడితే పది రోజుల్లో కళ్ళ చుట్టూ నలుపు మాయం అవుతుంది.మరి ఇంతకీ ఆ కాఫీ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్( Coffee Powder ) వేసి బాగా మరిగించి స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ కాఫీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloevera Gel ) వేసుకోవాలి.

Telugu Tips, Coffee, Coffee Cream, Dark Circles, Darkcircles, Eyes, Latest, Skin

అలాగే నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు కాఫీ, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, రెండు చుక్కలు స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కలిపితే మన కాఫీ క్రీమ్ అనేది రెడీ అవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని చల్లగా ఉన్న ప్రదేశంలో స్టోర్ చేసుకోవాలి.

రోజు నైట్ నిద్రించే ముందు మేకప్ ఏమైనా ఉంటే పూర్తిగా తొలగించి ఫేస్ వాష్ చేసుకోవాలి.

Telugu Tips, Coffee, Coffee Cream, Dark Circles, Darkcircles, Eyes, Latest, Skin

ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ను కళ్ల చుట్టూ అప్లై చేసుకుని సున్నితంగా ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఉదయాన్నే గోరువెచ్చని నీరుతో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ హోమ్ మేడ్ కాఫీ క్రీమ్ ను రెగ్యులర్ గా వాడటం వల్ల కళ్ళ చుట్టూ ఏర్పడిన నలుపు క్రమంగా మాయం అవుతుంది.

పది రోజుల్లోనే మీరు మంచి రిజల్ట్ ను పొందుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube