మామూలుగా సినిమాలలో హీరోలు చెప్పే డైలాగులు ఎంత పవర్ పుల్ గా ఉంటాయో మనందరికీ తెలిసిందే.ఇక ఆ డైలాగులను జీవితంలో కూడా చాలామంది సందర్భాన్ని బట్టి వాడుతూ ఉంటారు.
ఇక ఆ సినిమాలు విడుదల అయిన తర్వాత కూడా చాలా కాలం పాటు ఆ డైలాగులను గుర్తుంచుకుంటూ ఉంటారు.అలా ఇప్పటివరకు మహేష్ బాబు( Mahesh Babu ) ఎన్నో డైలాగులను చెప్పిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా మహేష్ బాబు డైలాగ్స్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే డైలాగ్ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు.మహేష్ పేరు వినగానే ముందుగా ఈ డైలాగ్ గుర్తుకు వస్తూ ఉంటుంది.
ఇలా మహేష్ బాబు సినిమా నుంచి ఇప్పటివరకు ఎన్నో డైలాగులు వచ్చాయి.
దాంతో ఆ డైలాగులు మరింత ఫేమస్ అయ్యాయి.అయితే ఇప్పుడు ప్రపంచ సినిమాకే తలమానికమైన డిస్నీ పిక్చర్స్ ( Disney Pictures )మహేష్ తో ఒక డీల్ ని సమకూర్చుకుందట.ప్రపంచ సినీ ప్రేమికులందరు అమెరికన్ మూవీ ముఫాసా: ది లయన్ కింగ్ ( American Movie Mufasa: The Lion King )ఎప్పుడెప్పుడు థియేటర్లలో విడుదల అవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.అందులో తెలుగు ప్రేక్షకులు కూడా ఉన్నారు.అయితే ఆ ఎక్సైట్మెంట్ ని మరింత పెంచుతూ తెలుగు ప్రేక్షకులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చారు.అదేమిటంటే తెలుగు వెర్షన్ కి సంబంధించి మహేష్ బాబు ముఫాసా కి తన వాయిస్ ని ఇవ్వనున్నాడు.ఈ విషయాన్నీ డిస్ని పిక్చర్స్ అధికారకంగా ప్రకటించింది.
ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో మహేష్ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కాగా 2019 లో వచ్చిన లయన్ కింగ్ కి సీక్వెల్ గా ముఫాసా: ది లయన్ కింగ్ వస్తున్న విషయం తెలిసిందే.ముఫాసా అనేది సింహం పేరు. డిసెంబర్ 20 న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది.
వరల్డ్ వైడ్ కూడా ఇదే డేట్ కి విడుదల కానుంది.ఇక మహేష్ బాబు కూడా ముఫాసా కి వాయిస్ ఓవర్ ఇవ్వడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు.ఆగస్టు 26న ఉదయం 11.07 గంటలకు తెలుగు ట్రైలర్ కూడా విడుదల కానుంది.అయితే మహేష్ బాబు తన తదుపరి సినిమాను రాజమౌళి తో చేయనున్న విషయం తెలిసిందే.జక్కన్న సినిమాతో హాలీవుడ్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంటారని అందరూ భావించారు.
కానీ ఇంకా ఆ సినిమా మొదలు కాకుండానే మహేష్ బాబు హాలీవుడ్ లో హంగామా చేస్తున్నారు.