తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి ప్రతి ఒక్కరు అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమం లోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క నటుడు కూడా తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంటారు.మరి ఇలాంటి క్రమంలోనే నితిన్( Nitin ) లాంటి స్టార్ హీరో సైతం వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకునే పనిలో చాలా బిజీగా ఉన్నాడు.
ఇక ప్రస్తుతం రాబిన్ హుడ్, తమ్ముడు ( Robin Hood, tammudu )అనే రెండు సినిమాలను చేస్తున్నాడు.అయితే ఈ రెండు సినిమాలతో సక్సెస్ లను అందుకుంటే తప్ప ఆయన ఇండస్ట్రీలో కొనసాగలేడు.నిజానికి వేణు శ్రీరామ్ తో చేస్తున్న తమ్ముడు సినిమాను మొదట అల్లు అర్జున్ చేయాల్సింది.అయితే అప్పట్లో వీళ్ళ కాంబో లో ఐకాన్ అనే సినిమా తెరకెక్కుతుంది.
అంటూ పలు వార్తలు కూడా వచ్చాయి.కానీ చివర్లో అది కార్య రూపం దాల్చలేదు.
ఇక ఇదే స్టోరీ ని తమ్ముడు గా మార్చి నితిన్ తో చేస్తున్నాడనే టాక్ అయితే ఉంది.ఇక నితిన్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక ఈ కథను అల్లు అర్జున్( Allu Arjun ) ఎందుకు రిజెక్ట్ చేసాడో తెలియదు కానీ ఈ సినిమాతో నితిన్ కనక మంచి సక్సెస్ ని అందుకుంటే తను కూడా స్టార్ హీరోగా ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… రాబిన్ హుడ్ విషయానికి వస్తే నితిన్ ఇంతకు ముందే వెంకీ కుడుముల( Venky Kudumula ) డైరెక్షన్ లో భీష్మ అనే సినిమా చేశాడు.ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న నితిన్ ఆ తర్వాత నుంచి ఒక సక్సెస్ ను కూడా అందుకోలేకపోయాడు.ఇక దాంతో ఎలాగైనా సరే ఇప్పుడు చేయబోయే సినిమాతో భారీ సక్సెస్ ను అందుకోవాలని చూస్తున్నాడు…
.