అన్ స్టాపబుల్ సీజన్4 అతిథుల జాబితా ఇదే.. ఈ సెలబ్రిటీల పేర్లు వింటే షాకవ్వాల్సిందే!

నందమూరి నటసింహం బాలకృష్ణ( Nandamuri Natasinham Balakrishna ) తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు అలాగే తన మాట తీరుతో అన్ స్టాపబుల్( Unstoppable ) అంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఇలా ఈ కార్యక్రమంలో బాలయ్య తనలో దాగి ఉన్న మరో టాలెంట్ బయట పెట్టారు.

 Unstoppable Season4 Guest List Details Inside Goes Viral In Socail Media , Soca-TeluguStop.com

బాలయ్య మాట తీరుతో ఈ టాక్ షో విపరీతమైనటువంటి రేటింగ్ కైవసం చేసుకుని మంచి సక్సెస్ సాధించింది అయితే ఇప్పటికే ఈ కార్యక్రమం మూడు సీజన్లను పూర్తి చేసుకుని త్వరలోనే నాలుగవ సీజన్ కూడా ప్రారంభం కాబోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఇప్పటికే ఇదే విషయాన్ని ఆహా వారు అధికారకంగా వెల్లడించారు.

త్వరలోనే ఈ షో ప్రారంభం కాబోతుందని తెలిపారు.అయితే దసరా పండుగను పురస్కరించుకొని సీజన్ ఫోర్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రారంభం కాబోతుందని సమాచారం.

ఇలా ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు అలాగే పొలిటిషియన్స్ కూడా హాజరయ్యారు మరి సీజన్ ఫోర్ లో అల్లు అరవింద్ ఎవరెవరిని ఈ కార్యక్రమానికి తీసుకురాబోతున్నారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

Telugu Allu Arvind, Apdeputy, Socail, Unstoppable-Movie

తాజాగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే గెస్ట్ ల గురించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి అల్లు అరవింద్( Allu Arvind ) ఈసారి చాలా పకడ్బందీగా గెస్ట్ లను సెలెక్ట్ చేశారని సమాచారం.సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం సీజన్ ఫోర్ కార్యక్రమంలో కింగ్ నాగార్జున మెగాస్టార్ చిరంజీవితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గెస్టులుగా రాబోతున్నారని తెలుస్తోంది.

Telugu Allu Arvind, Apdeputy, Socail, Unstoppable-Movie

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ వీరందరిని ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నారు.వీరి నుంచి ఎలాంటి సమాధానాలు రాబడుతున్నారనేది ఆసక్తిగా మారింది.మొదటి సీజన్ లో కేవలం సినీ సెలబ్రిటీలు వచ్చినప్పటికీ, రెండవ సీజన్లో చంద్రబాబు నాయుడు లోకేష్, కిరణ్ కుమార్ రెడ్డి వంటి పొలిటీషియన్స్ ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

ఇక ఈ సీజన్లో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారని అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube