ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) ప్రస్తుతం పుష్ప 2 ( Pushpa 2 ) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు వచ్చిందని తెలుస్తోంది.
అయితే తాజాగా అల్లు అర్జున్ సుకుమార్ భార్య తబిత నిర్మాతగా మారి నిర్మించిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా అభిమానులను ఉద్దేశిస్తూ ఈయన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఎవరైనా హీరోని చూసి అభిమానిగా మారుతారు నేను మాత్రం అభిమానులను చూసి హీరోగా మారానని తెలిపారు.
అయితే నా అభిమానులందరికీ నేను ఈ సందర్భంగా క్షమాపణలు చెబుతున్నాను నా సినిమా వచ్చి మూడు సంవత్సరాలైనా మీరెవరు కూడా నాపై అభిమానాన్ని తగ్గించలేదు ఇకపై ఇలా చేయనని త్వర త్వరగా సినిమాలు చేస్తానని తెలిపారు.ప్రస్తుతం పుష్ప 2 క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుందని నా కెరియర్ లోనే అత్యంత క్లిష్టమైన క్లైమాక్స్ ఇది అని తెలిపారు.అయినప్పటికీ సుకుమార్ గారు ఈవెంట్ కి రమ్మని చెప్పడంతో వచ్చానని తెలిపారు.
ఇక ఎవరో పిలిస్తే.ఎవరో చెబితే నేను రాను.నాకు ఇష్టమైన వాళ్ల కోసమే నేను వస్తాను నా మనసుకు రావాలనిపిస్తేనే వస్తాను అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్ పరోక్షంగా నాగబాబుకు ( Nagababu ) పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) కు కౌంటర్ ఇచ్చేలాగా ఉన్నాయి అంటూ అల్లు అర్జున్ అభిమానులు ఈ కామెంట్స్ వైరల్ చేస్తున్నారు.ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కోసం కాకుండా తన స్నేహితుడు వైకాపా అభ్యర్థి శిల్ప రవి కోసం అల్లు అర్జున్ వెళ్లడంతో ఎన్నో విమర్శలు వచ్చాయి.
ఇలా తనపై వచ్చిన విమర్శలకు ఇలా తన స్టైల్ లోనే సమాధానం చెప్పారంటూ అభిమానులు ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.