ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో( Delhi Liquor Scam ) అరెస్ట్ అయ్యి, కస్టడీలో భాగంగా ఢిల్లీ తీహార్ జైలులో ఉన్న బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( Kalvakuntla Kavitha ) మరోసారి అస్వస్థతకు గురయ్యారు .గత కొంతకాలంగా అనారోగ్యంతో కవిత ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పటికే అనేకసార్లు ఆమె బెయిల్( Bail ) ప్రయత్నాలు చేసినా, ఆమెకు ఊరట లభించలేదు. తాజాగా మరోసారి ఆమె అస్వస్థతకు గురయ్యారు.
వైరల్ ఫీవర్ తో పాటు, గైనిక్ సమస్యలతో ఆమె ఇబ్బందులు పడుతున్నట్లుగా సమాచారం.కవిత అస్వస్థతకు గురికాగానే ఆమెను జైలు అధికారులు ఎయిమ్స్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
గత జూలైలోను కవిత జ్వరం, గొంతు నొప్పితో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వెంటనే అధికారులు ఆమెను జైలు నుంచి ఎయిమ్స్ కు తరలించి వైద్య చికిత్స చేయించారు.ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి జైలుకు తరలించారు. మరోసారి ఆమె అస్వస్థత కి గురి కావడంతో కవిత సోదరుడు కేటీఆర్, ( KTR ) బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు( Harish Rao ) ఇద్దరు రేపు ఢిల్లీకి వెళ్లనన్నట్లు తెలుస్తోంది .కవిత బెయిల్ పిటిషన్ ను నిన్న కోర్టు విచారించింది. దీనిని ఈనెల 28క వాయిదా వేసింది.
బుధవారం కవితపై ఢిల్లీ హౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగగా , తీహారు జైలు నుంచి కవితను అధికారులు వర్చువల్ గా కోర్టులో హాజరు పరిచారు.
ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న కవితకు కోర్టులో బెయిల్ మంజూరయ్యే అవకాశం ఉన్నట్లుగా న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు కీలక పాత్ర ఉందని ఆరోపిస్తూ ఈడి, సిబిఐ అధికారులు మార్చి 15న హైదరాబాదులో ఆమెను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరచడం , అనంతరం ఆమెను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.గతంలోని తాను గైనిక్ సంబంధిత సమస్యతో బాధపడుతున్న కారణంగా బెయిల్ ఇవ్వాలని కవిత రౌత్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు.
అందుకు నిరాకరించిన కోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.మరోసారి అదే అనారోగ్యంతో కవిత ఆసుపత్రిలో జాయిన్ అయిన నేపథ్యంలో ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం ఉందని అంచనాలో అంత ఉన్నారు.