విశ్వంభర నుంచి సర్ప్రైజ్ వచ్చేసింది.. మెగాస్టార్ చిరంజీవి లుక్ అదిరిపోయిందిగా!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.

 Chiranjeevi First Look From Vishwambhara Details, Chiranjeevi, Chiranjeevi First-TeluguStop.com

ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట( Vashista ) దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభరా( Vishwambhara ) మూవీలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

యూవీ క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Telugu Chiranjeevi, Anil Ravipudi, Tollywood, Trisha, Vishwambhara-Movie

ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు మూవీ మేకర్స్.ఇది ఇలా ఉండే నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు( Megastar Chiranjeevi Birthday ) సందర్బంగా ఈ సినిమా నుంచి చిరంజీవికీ సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ను విడుదల చేసారు మూవీ మేకర్స్.కాగా తాజాగా విడుదల చేసిన ఆ పోస్టర్ లో చిరు త్రిశూలం చేత పట్టుకుని కన్పించారు.చీకటి, చెడు ఈ ప్రపంచాన్ని ఆక్రమించినప్పుడు, ఒక అద్భుతమైన తార పోరాడటానికి ప్రకాశిస్తుంది అని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది.

కాగా తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

Telugu Chiranjeevi, Anil Ravipudi, Tollywood, Trisha, Vishwambhara-Movie

చిరు ఫ్యాన్స్ ఆ పోస్టర్ పై కామెంట్ల వర్షం కురిపించడంతో పాటు ఆ పోస్టర్ ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.కాగా ఇప్పటివరకూ చిరంజీవి నటించిన సినిమాలతో పోలిస్తే, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.అంతేకాకుండా దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌ తో విశ్వంభర సినిమాను తెరకెక్కిస్తున్నారు.చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాగా ఇది నిలిచిపోనుంది.

అంతేకాదు సోషియో ఫాంటసీ మూవీ కావడంతో వీఎఫ్‌ఎక్స్‌ పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు సమాచారం.ఈ సినిమా కోసం 13 భారీ సెట్‌ లతో ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారు.

ఇంతకు ముందు ఎన్నడూ చూడని సరికొత్త అవతారంలో చిరంజీవి కనిపించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube