సినిమా తారల జీవితాలు అంటే ఏదో అద్భుతం అన్నట్లు ఫీలవుతారు చాలా మంది.పెద్ద బంగళాలు, చుట్టూ మనుషులు, లగ్జరీ కార్లు, బ్రాండెడ్ డ్రెస్సులు.
ఇవే కనిపిస్తాయి.కానీ చాలా మంది సినీ జనాల జీవితాల్లో వెండితెరపై కనిపించే కష్టాలకంటే ఎక్కువగానే ఉంటాయి.
సినిమా వాళ్ల జీవితాలు సినిమా కష్టాలను మించి ఉంటాయి.సేమ్ ఇలాంటి ఇబ్బందులనే ఎదురు చూశాడు బాలీవుడ్ టాప్ హీరో అనిల్ కపూర్.
ఇంతకీ ఆయన పడిన ఇబ్బందులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే ముచ్చట్ల 1980లోనిది అప్పుడు అనిల్ కపూర్ సినిమా అవకాశాల కోసం ఎంతో ప్రయత్నిస్తున్నాడు.
ఇండస్ట్రీలో చిన్నాచితకా పనులు చేసేవాడు.రాత్రిపూట తను ఇష్టపడ్డ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవాలి అని ఆలోచించేవాడు.
ఆయన ఇష్టపడ్డ అమ్మాయి సునీత టాప్ మోడల్.తన తండ్రి ఎస్బీఐలో ఆఫీసర్.
వీరిమధ్య పరిచయం ఏర్పడింది.ఓరోజు ప్రేమికులుగా కలిశారు.
ఇద్దరికి ఒకరిపై మరోకరికి ఎంతో అభిమానం ప్రేమ ఉండేవి.తను మోడల్ కావడంతో ఎక్కడైనా ఫోటోషూట్ జరిగితే అక్కడికి వెళ్లేవాడు అనిల్.
తనతో ఎంతో చక్కగా మాట్లాడేది.ఎంతో ప్రేమను కనడర్చేది.
తను ఫోటో షూట్ల కోసం విదేశాలకు వెళ్లినప్పుడు.అనిల్ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేవాడు.
కానీ తనకు అంత ఈజీగా అవకాశం రాలేదు.తెలుగలో బాపు తెరకెక్కించిన వంశవృక్షం సినిమాలో అవకాశం వచ్చింది.ఆ తర్వాత బాలీవుడ్ లో కొన్ని సైడ్ క్యారెక్టర్స్ చేశాడు.1983లో వచ్చిన వో సాత్ దిన్ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.అవకాశాలు రావడం మొదలు పెట్టాయి.
అటు సునీత, అనిల్ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసింది.సునీత తల్లిదండ్రులు వీరి ప్రేమకు ఒప్పుకోలేదు.కానీ సునీత మాత్రం అనిల్ అంటే చాలా ఇష్టం అని చెప్పింది.
అటు 1984లో మషాల్ సినిమా సూపర్ హిట్ కొట్టింది.ఈ సినిమాతో స్టార్ హీరోగా ఎదిగాడు.
ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిన ఐదేండ్లకు అందరి సమక్షంలో 1984 మే 19న వీరి పెళ్లి జరిగింది.అన్ని విషయాల్లో అనిల్ కు అండగా నిలిచింది సునీత.
ఆయనతో కలిసి ఓ మంచి జీవితానికి పునాది వేసింది.సినిమా జీవితంతో పాటు వ్యక్తిగత జీవితంలో అతడిని ఉన్నత స్థాయికి వెళ్లేలా చేసింది.
సునీతతో పెళ్లి తర్వాత అనిల్ మరింత విజయవంతంగా సినిమా రంగంలో దూసుకెళ్లాడు.