గత వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులకు గురైన రిటైర్డ్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు( AB Venkateswara Rao ) మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు.గత టిడిపి ప్రభుత్వ హయాంలోనూ ఏబీ వెంకటేశ్వరరావు ఇంటిలిజెన్స్ చీఫ్ గా కీలక బాధ్యతలు నిర్వహించడం ,చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ముద్ర పడటం వంటి వ్యవహారాలతో జగన్ కు( Jagan ) విరోధిగా మారారు.
దీంతో వైసీపీ ప్రభుత్వంలో ఏబీ వెంకటేశ్వరరావు పై అనేక విధాలుగా జగన్ కక్ష తీర్చుకున్నారు.వైసిపి ప్రభుత్వ హయాంలో తన ఉద్యోగాన్ని నిలుపుకునేందుకు న్యాయస్థానంలో పోరాటం చేసి చివరగా రిటైర్డ్ అయ్యే రోజున బాధ్యతలు చేపట్టి , సాయంత్రం పదవీ విరమణ పొందడం వంటివన్నీ ఏవి వెంకటేశ్వరరావు లో మరింత కసిని పెంచాయి.

ప్రస్తుతం టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ,ఏబీ వెంకటేశ్వర్ రావు మళ్ళీ యాక్టివ్ అయ్యారు .ఈ మేరకు జగన్ ను ఉద్దేశిస్తూ ఏబీ వెంకటేశ్వరావు హెచ్చరికలు చేశారు.నిన్న మీడియా సమావేశంలో జగన్ సోషల్ మీడియా అరెస్టులకు అంశంపై స్పందిస్తూ, వైసిపి( YCP ) సోషల్ మీడియా యాక్టివిస్తులను అరెస్టు చేసేలా పోలీస్ శాఖను ప్రయోగిస్తున్నారని, ఈ అరెస్టులపై సీఎం చంద్రబాబుకు( CM Chandrababu ) సలహాలు ఇచ్చేందుకు ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు నిరంతరం సీఎం సచివాలయంలో తిష్ట వేసి ఉంటున్నారని జగన్ ఆరోపించారు.ఏబీ వెంకటేశ్వరరావు , ఆర్.పి ఠాకూర్ , యోగానంద పేర్లను ఈ సందర్భంగా జగన్ ప్రస్తావించారు.

ఈ ముగ్గురు రిటైర్డ్ అధికారులు అన్ని జిల్లాలలో వైసీపీ నాయకుల చిట్టాను ఇటిలిజెన్స్ విభాగం ద్వారా తెప్పించుకొని ఒక ప్రణాళికతో అరెస్టులు చేస్తున్నారని జగన్ ఆరోపించారు.జగన్ ఆరోపణలపై తాజాగా ఏపీ వెంకటేశ్వరావు ఘాటుగా స్పందించారు.” మిస్టర్ జగన్ రెడ్డి .నోరు అదుపులో పెట్టుకో , మాట సరిచేసుకో, భాష సరిచూసుకో, ఒకసారి ప్రజల విశ్వాసం కోల్పోయిన ,ఒకసారి నోరు జారినా, వాటిని తిరిగి ఎన్నటికీ పొందలేరు.నీలా కు సంస్కారంతో నేను మాట్లాడను.
తెర వెనుక బాగోతాలు నడపను.నేనేంటో నా తలవంచని నైజం ఏమిటో గడిచిన ఐదేళ్లలో నువ్వే చూసావ్.బి కేర్ పుల్ ‘ అంటూ ఏవి వెంకటేశ్వరావు జగన్ హెచ్చరించారు.‘ ఫర్ ది రికార్డ్ అంటూ నిన్న నువ్వు నా గురించి చెప్పింది పచ్చి అబద్ధం ‘ అంటూ స్పందించారు.