బైక్‌పై నుంచి కింద పడిన పేరెంట్స్.. పిల్లోడితో అర కి.మీ ఉరికిన బైక్..?

సాధారణంగా ఏదైనా రోడ్డు ప్రమాదానికి గురైతే తీవ్రమైన గాయాలు అవుతాయి.కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోవచ్చు కానీ ఇటీవల జరిగిన ఒక బైక్ యాక్సిడెంట్( Bike Accident ) సంఘటనలో అలా ఏం జరగలేదు.

 Mother Father Both Fell From The Bike But Bike Went Ahead With Baby Around 500 M-TeluguStop.com

దేవుడు రక్షణగా ఉంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా సురక్షితంగా బయటపడవచ్చు అని పెద్దోళ్ళు అంటుంటారు.ఈ సంఘటన గురించి తెలుసుకుంటే అది నిజమేనేమో అనిపిస్తుంది.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గానూ మారింది.

వివరాల్లోకి వెళ్తే ఇటీవల ఒక కపుల్ పిల్లోడిని( Kid ) బైక్ ఫ్యూయల్ ట్యాంక్ పై కూర్చోబెట్టి రోడ్డుపై బయలుదేరారు.వాళ్లు అలా బైక్ వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ముందున్న స్కూటీని( Scooter ) ఢీ కొట్టారు.ఈ ఘటనను వెనకాల వెళ్తున్న మరొక కారులోని డాష్‌క్యామ్ కెమెరా రికార్డ్ చేసింది.

ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న తల్లిదండ్రులు( Parents ) కింద పడిపోయారు.కానీ ఆశ్చర్యకరంగా, బైక్ మీద ఉన్న పిల్లవాడు మాత్రం కింద పడకుండా బైక్‌పైనే కూర్చుని ఉండిపోయాడు.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ బైక్ పిల్లవాడితో సహా దాదాపు అర కిలోమీటరు దూరం వరకు ఒంటరిగా వెళ్లింది.

బైక్ చివరకు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది.అప్పుడు పిల్లవాడు బైక్( Bike ) నుంచి పొదల్లో పడ్డాడు.కొంత సేపటికి కొంతమంది అక్కడకు వచ్చి పిల్లవాడిని తీసుకున్నారు.

ఇంత పెద్ద ప్రమాదం నుంచి ఆ బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు.అయితే బైక్ మరొక వాహనాన్ని ఢీకొంటే పిల్లవాడి ప్రాణానికి ముప్పు వచ్చేది.

కానీ అదృష్టం కొద్దీ అలా జరగలేదు.అయితే ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ఎక్కడ జరిగిందో తెలియ రాలేదు.

@HasnaZarooriHai అనే ట్విట్టర్ అకౌంట్ దీన్ని షేర్ చేసింది బైక్‌ అతివేగంతో వెళ్లడం వల్లే రైడర్‌ అదుపు తప్పి స్కూటర్‌ను ఢీకొట్టినట్లు వీడియో చూసిన వాళ్లు కామెంట్ చేస్తున్నారు.అలాగే ఆ బాలుడు చాలా లక్కీ అని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube