సాధారణంగా దర్శకులు ఏదైనా కథ రాయాలనుకున్నప్పుడు అది ఏ హీరోకి సరిగ్గా సూట్ అవుతుందో ఆలోచిస్తారు.ఫలానా హీరోకి ఫలానా స్టోరీ బాగుంటుంది అని ఫిక్స్ అయ్యాక ఇక ఆ హీరోకి తగినట్లుగానే కథ రాసుకుంటూ వెళ్తారు.
ఆ హీరోను మైండ్ లో ఉంచుకునే స్టోరీ మొత్తం డెవలప్ చేసుకుంటారు.చివరికి వాళ్లు అనుకున్న యాక్టర్ ఆ కథకు నో చెప్పినా, చేయలేము అని అన్నా ఫుల్ డిసప్పాయింట్ అవ్వక తప్పదు.
అలాంటి డిసప్పాయింట్మెంట్‌కి కొంత మంది దర్శకులు గురయ్యారు.వారెవరో తెలుసుకుందాం.
అనిల్ రావిపూడి – రామ్ పోతినేని
స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి “రాజా ది గ్రేట్( Raja The Great )” సినిమాతో ఒక మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.ఇందులో రవితేజ హీరోగా నటించాడు.“ఏమో సార్ నాకు కనపడదు” అంటూ రవితేజ ఈ మూవీలో చెప్పిన డైలాగ్స్ బాగా హిట్ కూడా అయ్యాయి.ఈ బ్లైండ్ క్యారెక్టర్‌కి రవితేజ బాగా సెట్ అయ్యాడు కానీ ఈ సినిమా స్టోరీని హీరో రామ్ పోతినేనిని దృష్టిలో పెట్టుకొని రాసుకున్నాడు అనిల్ రావిపూడి.
కానీ అప్పట్లో రామ్ బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ మూవీ చేయడానికి ఒప్పుకోలేకపోయాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ – పవన్ కళ్యాణ్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ “అతడు” సినిమా స్టోరీని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని దృష్టిలో పెట్టుకొని రాసుకున్నాడు.కానీ పవన్ కళ్యా( Pawan Kalya(ణ్ ఈ స్టోరీ తనకు కనెక్ట్ కాదని దాన్ని రిజెక్ట్ చేశాడు.కట్ చేస్తే అదే పెద్ద హిట్ అయింది.
దీన్ని రిజెక్ట్ చేసినందుకు త్రివిక్రమ్ పవన్ ని ఇప్పటికీ తిడుతుంటాడట.పవన్ ఈ మూవీ ని తీసి ఉన్నట్లయితే మరొక క్లాసిక్ హిట్ ఖాతాలో పడి ఉండేది.
లోకేష్ కనగరాజ్ – రాఘవ లారెన్స్
ఈ దర్శకుడు విక్రమ్ సినిమాలో సంధానం పాత్రను రాఘవ లారెన్స్( Raghava Lawrence ) కోసం రాశాడు.కానీ రాఘవ లారెన్స్ ఆ పాత్ర చేయలేకపోయాడు దీని ఫలితంగా దాన్ని పోషించే ఛాన్స్ విజయ్ సేతుపతికి వచ్చింది.ఈ సినిమా 500 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.మూవీ ఇందులో నటించిన వారందరికీ చాలా ప్లస్ పాయింట్ అయింది.