శ్రావణమాసం ఎఫెక్ట్ .. టి. కాంగ్రెస్ లో చేరికలు షురూ

తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలు జోరు పెరిగేటట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరిపోయారు.

 Sravana Masam Effect Joinings In Telangana Congress , Brs, Bjp, Congress, Tela-TeluguStop.com

ఇంకా అనేకమంది కీలక నాయకులు చేరేందుకు సిద్ధమయ్యారు.శ్రావణమాసం పురస్కరించుకుని కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తాలు పెట్టుకున్నారు.

అయితే మొన్నటి వరకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు,  సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) విదేశీ పర్యటనకు వెళ్లడంతో వీరంతా వెయిటింగ్ లోనే ఉన్నారు.ప్రస్తుతం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనను ముగించుకుని తిరిగి వచ్చారు.

వెంటనే ఢిల్లీకి వెళ్లి వచ్చారు.ఆయన హైదరాబాద్ కు చేరుకుని వెంటనే అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

దీంతో కాంగ్రెస్ లో చేరేందుకు వెయిటింగ్ చేస్తున్న నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ముహూర్తాలు సిద్ధం చేసుకుంటున్నారు.అసలే ఇది శ్రావణమాసం కావడంతో మంచి ముహూర్తాలు ఉన్నాయి.

Telugu Aicc, Congress, Pcc, Revanth Reddy, Telangana-Politics

రేవంత్ రెడ్డి కూడా విదేశాల నుంచి రావడంతో బీ ఆర్ ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు,  కీలక నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్సీలు 10 మంది వరకు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు.కేసీఆర్( KCR ) కు అత్యంత సన్నిహితులుగా పేరుపొందిన వారు ఎంతోమంది బీ ఆర్ ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.మరి కొంతమంది ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధమవుతున్నారు.

రేవంత్ రెడ్డి సమక్షంలోనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటే ఆ ప్రాధాన్య వేరేగా ఉంటుందనే లెక్కల్లో రేవంత్ కోసం మీరంతా వెయిటింగ్ లో ఉన్నారు.దాదాపు 8 మంది వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారని,  వీరంతా విడతల వారీగా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Telugu Aicc, Congress, Pcc, Revanth Reddy, Telangana-Politics

కాంగ్రెస్ నుంచి ప్రాధాన్యం , పదవులు విషయంలో సరైన హామీ రాకపోయినా,  ఆ పార్టీలోనే చేరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,  కీలక నేతలు ఆసక్తి చూపిస్తున్నారట.ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండడం తో వీరంతా ఆ పార్టీ వైపే ఎక్కువ మొగ్గుచూపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube