సాధారణంగా అమ్మాయిల్లో చాలా మంది లాంగ్ అండ్ షైనీ హెయిర్( Shiny hair ) ను కోరుకుంటారు.అటువంటి జుట్టును పొందడం కోసం రకరకాల హెయిర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు.
అయినా సరే కొందరిలో జుట్టు అనేది సరిగ్గా ఎదగదు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.
వారానికి ఒక్కసారి ఈ రెమెడీని ఫాలో అయితే పొడవాటి మరియు మెరిసేటి కురులు మీ సొంతం అవుతాయి.
![Telugu Care, Care Tips, Pack, Healthy, Remedy, Ong, Shiny-Telugu Health Telugu Care, Care Tips, Pack, Healthy, Remedy, Ong, Shiny-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2024/08/shiny-hair-hair-care-hair-care-tips-healthy-hair-home-remedy-hair-pack-hair.jpg)
అందుకోసం ముందుగా ఒక ఉల్లిపాయ( Onion )ను తీసుకుని తొక్క తొలగించి వాటర్ తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి.అలాగే నాలుగు రెబ్బలు కరివేపాకు మరియు ఒక ఎగ్ వైట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
![Telugu Care, Care Tips, Pack, Healthy, Remedy, Ong, Shiny-Telugu Health Telugu Care, Care Tips, Pack, Healthy, Remedy, Ong, Shiny-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2024/08/long-hair-shiny-hair-hair-care-hair-care-tips-healthy-hair-home-remedy-hair-growth.jpg)
40 నిమిషాలు లేదా గంట అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.
అలాగే కురులు షైనీ గా మెరుస్తాయి.హెయిర్ బ్రేకేజ్ సమస్య సైతం దూరం అవుతుంది.
ఇక ఈ రెమెడీని ఫాలో అవ్వడంతో పాటుగా రసాయనాలతో కూడిన షాంపూలను వాడటం, హెయిర్ స్టైలింగ్ టూల్స్ వినియోగించడం మానుకోండి.అలాగే డైట్ లో జుట్టు పెరుగుదలకు సహాయపడే కొన్ని ఆహారాలను కూడా చేర్చుకోవాలి.
తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, నట్స్ అండ్ సీడ్స్, ఎగ్స్, పెరుగు, చేపలు వంటి ఫుడ్స్ లో ప్రోటీన్, బయోటిన్, విటమిన్ ఎ మరియు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.ఇవి హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తాయి.
బలమైన, ఆరోగ్యమైన కురులకు మద్దతు ఇస్తాయి.