యంగ్ హీరో రాజ్ తరుణ్( Raj Tarun ) నటించిన పురుషోత్తముడు, తిరగబడర సామి సినిమాలు కేవలం వారం రోజుల గ్యాప్ లో థియేటర్లలో విడుదలై ఫ్లాపులుగా నిలిచాయి.మరోవైపు రాజ్ తరుణ్ భలే ఉన్నాడే( Bhale Unnade Movie ) అనే సినిమాలో నటించగా ఈ సినిమా నుంచి ట్రైలర్ తాజాగా విడుదలైంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజ్ తరుణ్ కు మ్యాటర్ లేదంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు.
ఈ ప్రమోషనల్ వీడియో గురించి తన దృష్టికి రావడంతో రాజ్ తరుణ్ లవర్ లావణ్య( Lavanya ) స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
నా ఉసురు తగిలి ఈ సినిమా కూడా పోతుంది అంటూ ఆమె చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.సినిమా ప్రమోషన్స్ కోసం ఇంతలా దిగజారుతారని నేను అనుకోలేదని ఆమె తెలిపారు.
దీన్ని రాజ్ తరుణ్ ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదని ఆమె వెల్లడించారు.
రాజ్ తరుణ్ కు మేటర్ లేదంటూ వచ్చిన వీడియోను నేను చూసిన వెంటనే ఈ వీడియో నా గర్భం అబార్షన్ కు సంబంధించి కేసును తప్పుదోవ పట్టించడానికి రిలీజ్ చేసిన వీడియో అని అనుకున్నానని ఆమె వెల్లడించారు.ఈ వీడియో విడుదలైన తర్వాత చాలామంది నన్ను ఫోన్ కాల్స్ చేసి తిడుతున్నారని ఆమె పేర్కొన్నారు.ఆ వీడియోకు నాకు సంబంధం లేదని చెబుతున్నా వినిపించుకోవడం లేదని ఆమె తెలిపారు.
నన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని లావణ్య వెల్లడించారు.లావణ్య చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.లావణ్యకు సోషల్ మీడియాలో క్రేజ్ పెరుగుతోంది.రాజ్ తరుణ్ లావణ్య కేసు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.ఈ కేసు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి