నా ఉసురు తగిలి ఈ సినిమా కూడా పోతుంది.. రాజ్ తరుణ్ లవర్ షాకింగ్ కామెంట్స్!

యంగ్ హీరో రాజ్ తరుణ్( Raj Tarun ) నటించిన పురుషోత్తముడు, తిరగబడర సామి సినిమాలు కేవలం వారం రోజుల గ్యాప్ లో థియేటర్లలో విడుదలై ఫ్లాపులుగా నిలిచాయి.

మరోవైపు రాజ్ తరుణ్ భలే ఉన్నాడే( Bhale Unnade Movie ) అనే సినిమాలో నటించగా ఈ సినిమా నుంచి ట్రైలర్ తాజాగా విడుదలైంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజ్ తరుణ్ కు మ్యాటర్ లేదంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు.

ఈ ప్రమోషనల్ వీడియో గురించి తన దృష్టికి రావడంతో రాజ్ తరుణ్ లవర్ లావణ్య( Lavanya ) స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

నా ఉసురు తగిలి ఈ సినిమా కూడా పోతుంది అంటూ ఆమె చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సినిమా ప్రమోషన్స్ కోసం ఇంతలా దిగజారుతారని నేను అనుకోలేదని ఆమె తెలిపారు.దీన్ని రాజ్ తరుణ్ ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదని ఆమె వెల్లడించారు.

"""/" / రాజ్ తరుణ్ కు మేటర్ లేదంటూ వచ్చిన వీడియోను నేను చూసిన వెంటనే ఈ వీడియో నా గర్భం అబార్షన్ కు సంబంధించి కేసును తప్పుదోవ పట్టించడానికి రిలీజ్ చేసిన వీడియో అని అనుకున్నానని ఆమె వెల్లడించారు.

ఈ వీడియో విడుదలైన తర్వాత చాలామంది నన్ను ఫోన్ కాల్స్ చేసి తిడుతున్నారని ఆమె పేర్కొన్నారు.

ఆ వీడియోకు నాకు సంబంధం లేదని చెబుతున్నా వినిపించుకోవడం లేదని ఆమె తెలిపారు.

"""/" / నన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని లావణ్య వెల్లడించారు.లావణ్య చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

లావణ్యకు సోషల్ మీడియాలో క్రేజ్ పెరుగుతోంది.రాజ్ తరుణ్ లావణ్య కేసు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

ఈ కేసు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి .

ఇది కదా ఫ్యాన్స్ కోరుకునే ఎమోషన్.. గేమ్ ఛేంజర్ అప్డేట్ ఫుల్ కిక్ ఇచ్చిందిగా!