అమెరికా పౌరసత్వ ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) భాగస్వామ్యంతో యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ .( US State Department ) 2024 ఆర్ధిక సంవత్సరానికి గాను ఉపాధి ఆధారిత ఐదవ ప్రాధాన్యత (EB-5) అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీలో అందుబాటులో ఉన్న అన్ని వీసాలను మంజూరు చేసినట్లు ఇటీవల ధృవీకరించింది.
అమెరికాలో వ్యాపారాలను ప్రారంభించాలనుకునే విదేశీ పెట్టుబడిదారులకు( Foreign Investors ) ఈబీ -5 వీసాలు కీలకమైనవి.దేశవ్యాప్తంగా ఉద్యోగ సృష్టి, ఆర్ధిక వృద్ధికి ఇవి దోహదం చేస్తాయి.
యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఫండ్ (యూఎస్ఐఎఫ్) అధ్యక్షుడు , సీఎంవో నికోలస్ మాస్ట్రోయిని( Nicholas Mastroianni ) మాట్లాడుతూ.ఈబీ-5 వీసాలు( EB-5 Visa ) అమెరికాలో స్థిరమైన భవిష్యత్తును నిర్ధారిస్తాయన్నారు.యూఎస్ వీసా ల్యాండ్‌స్కేప్ ఒక మైన్‌ఫీల్డ్ వంటిదన్న ఆయన హెచ్1బీ వీసాపై మాత్రమే ఆధారపడటం భవిష్యత్తుతో జూదం వంటిదన్నారు.ఈ వీసాల జారీ .ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ (ఐఎన్ఏ) ద్వారా నిర్వహించబడుతుంది.ఇది ఉపాధి ఆధారిత వలస వీసాల సంఖ్యపై వార్షిక పరిమితులను నిర్దేశిస్తుంది.ఈబీ-5 వర్గానికి సంబంధించి , ఈ పరిమితి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మొత్తం ఉపాధి ఆధారిత వీసాలలో 7.1 శాతం.
సీ5, టీ5, ఐ5, ఆర్5, ఆర్‌యూ, ఎన్‌యూ వంటి కేటగిరీలు సహా అన్ రిజర్వ్‌డ్ వీసా వర్గాలకు 68 శాతం కేటాయింపులు జరిగాయి.దీనితో పాటు ఈబీ-5 రీఫార్మ్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ 2022 ప్రకారం.2022 ఆర్ధిక సంవత్సరం నుంచి ఉపయోగించని ఈబీ-5 రిజర్వ్‌డ్ వీసాలు 2024 ఆర్ధిక సంవత్సరానికి అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీలలో చేర్చడానికి అనుమతిస్తుంది.తాజా ఆర్ధిక సంవత్సరానికి అన్ని ఈబీ 5 అన్ రిజర్వ్‌డ్ వీసాలు ప్రస్తుతానికి కేటాయించబడినందున.
అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లు అన్ని కేటగిరిలలో వీసాల జారీని మిగిలిన ఆర్ధిక సంవత్సరంలో నిలిపివేస్తాయి.
ఇకపోతే.
అమెరికా వెళ్లాలనుకుంటున్న వారికి కీలకమైన హెచ్ 1, ఎల్ 1, ఈబీ 5 వంటి నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా రుసుములు పెరిగిన సంగతి తెలిసిందే.ఇమ్మిగ్రేషన్ విధానాలు , అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపే వీసా సేవల్లో మార్పులు అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ చర్చనీయాంశమైంది.