తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు నాగార్జున…( Nagarjuna ) ఆయన తన కెరియర్ మొదటి నుంచి కూడా ఇప్పటివరకు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇప్పటి వరకు హీరోగా తప్ప మిగిలిన ఏ క్యారెక్టర్లలో నటించని నాగార్జున ఇప్పుడు ఏకంగా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే నాగార్జున తనదైన రీతిలో సినిమాలు చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే రజనీకాంత్ తో( Rajinikanth ) చేస్తున్న కూలీ సినిమాలో( Coolie Movie ) ఆయన విలన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాతో ఆయన స్టార్ హీరోగా మారడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.మరి ఇలాంటి సందర్భంలోనే నాగార్జున చేస్తున్న ఈ క్యారెక్టర్ మీద పలు రకాల అభ్యంతరాలు అయితే వ్యక్తం అవుతున్నాయి.
కొంతమంది అక్కినేని అభిమానులు సైతం నాగార్జున ఈ క్యారెక్టర్ చేయడం వాళ్లకు నచ్చలేదని నాగార్జున హీరోగా చేస్తేనే బాగుండేదని పలు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం కూలీ సినిమాలోని క్లైమాక్స్ పార్ట్ షూట్ చేస్తున్నారట.ఇక అందులో భాగంగానే రజినీకాంత్ నాగార్జునను కొట్టాడని ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.మరి మొత్తానికైతే విలన్ గా ఉన్న నాగార్జున ని రజనీకాంత్ గెలవాలి అంటే అతన్ని కొట్టాలి వీలైతే చంపేయాలి కూడా అలాంటి ఒక క్యారెక్టర్ ను డిజైన్ చేసిన లోకేష్ కనకరాజ్ ఈ సినిమాలో నాగార్జున పాత్రతో ఎలా మైమరిపింప చేసేలా నటింపజేశాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…