మాట నిలబెట్టుకున్న న్యూయార్క్ మేయర్.. స్కూళ్లకు దీపావళి సెలవు

దీపావళి( Diwali ) పర్వదినం సందర్భంగా మన దివ్వెల పండుగ అరుదైన గౌరవం దక్కింది.దీపావళి సందర్భంగా న్యూయార్క్‌లోని స్కూళ్లకు అక్కడి మేయర్ సెలవు ప్రకటించారు.

 Diwali To Be Official School Holiday For New York City Schools ,diwali, Joe Bid-TeluguStop.com

తద్వారా న్యూయార్క్ నగరంలోని ప్రభుత్వ పాఠశాలలు దీపావళికి అధికారికంగా సెలవు ప్రకటించాల్సి ఉంటుంది.దీని ద్వారా 1.1 మిలియన్ల మంది విద్యార్ధులు పండుగ సెలబ్రేషన్స్‌లో పాల్గొనవచ్చు.ప్రభుత్వ ఆదేశంతో నవంబర్ 1న న్యూయార్క్‌ నగరంలోని పాఠశాలలు మూసివేయబడతాయి.

Telugu Dilip Chauhan, Diwali, Eric Adams, Joe Biden, York, York Schools, School

దీపావళి సెలవుపై న్యూయార్క్ నగర మేయర్ కార్యాలయం అంతర్జాతీయ వ్యవహారాల డిప్యూటీ కమీషనర్ దిలీప్ చౌహాన్ ( Dilip Chauha )హర్షం వ్యక్తం చేశారు.నగరంలో తొలిసారిగా దీపావళికి ప్రభుత్వ పాఠశాలలు సెలవుదినంగా జరుపుకోవడం మన నగర వైవిధ్యానికి, కమ్యూనిటీ నేతల కృషికి నిదర్శనమని దిలీప్ అన్నారు.నగరంలోని దాదాపు 1.1 మిలియన్ల మంది విద్యార్ధులు ఈ నిర్ణయంతో సంతోషంగా గడుపుతారని ఆయన చెప్పారు.ఐక్యతకు నిజమైన చిహ్నంగా, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి నిలిచిందని దిలీప్ అన్నారు.

Telugu Dilip Chauhan, Diwali, Eric Adams, Joe Biden, York, York Schools, School

న్యూయార్క్‌లో స్థిరపడిన ప్రవాస భారతీయులకు ఈ సెలవు.ఇరుగు పొరుగుతో కలవడానికి వీలు కల్పిస్తుందని ఆయన ఆకాంక్షించారు.నిజానికి గతేడాది దీపావళి నాడు న్యూయార్క్‌లోని పాఠశాలలకు సెలవు మంజూరు చేసే చట్టంపై రాష్ట్ర గవర్నర్ క్యాథీ హోచుల్ ఆమోదముద్ర వేశారు.

కాగా.రెండ్రోజుల క్రితం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరయ్యారు.దాదాపు 600 మందికి పైగా భారతీయ అమెరికన్లు ( Indian Americans )ఈ వేడుకల్లో పాలు పంచుకున్నారు.ఈ సందర్భంగా జో బైడెన్ మాట్లాడుతూ .అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో ఇప్పటి వరకు భారీ దీపావళి వేడుకలను నిర్వహించడం గర్వంగా ఉందన్నారు.సెనేటర్, వైస్ ప్రెసిడెంట్, దక్షిణాసియా అమెరికన్లు తన యంత్రాంగంలో కీలక సభ్యులుగా ఉన్నారని ఆయన తెలిపారు.కమలా హారిస్ నుంచి డాక్టర్ వివేక్ మూర్తి వరకు మీలో చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని బైడెన్ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube