నేడు దీపావళి పండుగ( Diwali Festival ) సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు పటాకులు పేలుస్తున్నారు.
ఈ దివాళీ సెలబ్రేషన్స్‌కు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియోలో, ఒక వ్యక్తి అమెజాన్ అలెక్సా( Alexa ) అనే స్మార్ట్ స్పీకర్‌ని ఉపయోగించి చిన్న దీపావళి రాకెట్‌ని( Diwali Rocket ) ప్రయోగించారు.
ఆయన అలెక్సాకి “అలెక్సా, రాకెట్‌ని ప్రయోగించు” అని చెప్పగానే అలెక్సా “ఓకే బాస్, రాకెట్‌ని లాంచ్ చేస్తున్నా” అని సమాధానం చెప్పింది.తర్వాత వెంటనే ఆ ఫైర్ క్రాకర్ మండి ఆకాశంలోకి దూసుకెళ్లింది.
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్నారు.మనీస్ ప్రాజెక్ట్స్ ల్యాబ్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో “అలెక్సాతో రాకెట్‌ని ప్రయోగిస్తున్నాను” అనే క్యాప్షన్‌తో ఈ వీడియోని పోస్ట్ చేశారు.
దీనికి ఇప్పటికే 13 మిలియన్‌కు పైగా మంది చూశారు.
ఆ వీడియో చూసిన వాళ్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.కొందరు “అలెక్సా రాక్స్, హ్యూమన్స్ షాక్డ్” అని అంటున్నారు.మరికొందరు “కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని ఏలుతుంది” అని భయపడుతున్నారు.
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ అకౌంట్ కూడా స్పందించింది. “కృత్రిమ మేధస్సు( AI ) చాలా దూరం వెళ్లిపోయింది (అక్షరాలా)” అని కామెంట్ చేసింది.
మరొక వ్యక్తి తన అనుభవాన్ని పంచుకుంటూ, “నేను గత దీపావళికి అర్డుయినో మాడ్యూల్‌ని ఉపయోగించి ఇలాంటిదే చేశాను.అది వాయిస్ కమాండ్‌లను అంగీకరిస్తుంది.ఆ కమాండ్‌ల ఆధారంగా రాకెట్‌ని ప్రయోగిస్తుంది” అని చెప్పారు.కొన్ని కామెంట్లు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి.ఒకరు “స్పేస్‌ఎక్స్ నుంచి వెయ్యి మిస్డ్ కాల్స్ వచ్చాయి” అని అంటే, మరొకరు “ఎలాన్ మస్క్ మీ ఇంటికి వస్తున్నాడు” అని జోక్ చేశారు.వీడియో అప్‌లోడ్ చేసిన వ్యక్తి రాకెట్‌ను ఎలా ప్రయోగించారో చూపించే మరిన్ని వీడియోలు కూడా పోస్ట్ చేశారు.
ఇది ఎలా చేయాలో తెలుసుకోవాలనుకునే వారి కోసం యూట్యూబ్‌లో ట్యూటోరియల్ కూడా ఉంది.