యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,( Jr NTR ) కొరటాల శివ( Koratala Siva ) కాంబో మూవీ దేవర( Devara ) విడుదలై 33 రోజులైనా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.ఆరు సింగిల్ స్క్రీన్లలో దేవర మూవీ సంచలన రికార్డ్ ను సొంతం చేసుకుంది.
ఆరు సింగిల్ స్క్రీన్లలో ఈ సినిమా ఏకంగా కోటి రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.ఆరు సింగిల్ స్క్రీన్లలో ఈ సినిమా సాధించిన రికార్డ్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.
సుదర్శన్ 35 ఎం.ఎం, విశ్వనాథ్ 70 ఎం.ఎం, ప్రసాద్స్ మల్టీప్లెక్స్ స్క్రీన్ 6, శ్రీరాములు 70 ఎం.ఎం, ఎం1 సినిమాస్ స్క్రీన్2, జగదాంబ 70 ఎం.ఎంలలో ఈ సినిమా కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.దేవర సినిమా సాధించిన రికార్డులు న భూతో న భవిష్యత్ అనేలా ఉన్నాయి.
మిక్స్డ్ టాక్ తో ఈ రేంజ్ లో కలెక్షన్లను( Devara Collections ) సొంతం చేసుకోవడం దేవరకు మాత్రమే సాధ్యమైందని చెప్పవచ్చు.

దేవర మూవీ సాధిస్తున్న ఈ రికార్డులు అభిమానులకు సైతం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.దేవర సినిమాలో తారక్ లుక్స్ కు సైతం మంచి మార్కులు పడ్డాయి.దేవర, వర పాత్రల్లో తారక్ అదరగొట్టారనే చెప్పాలి.
దేవర సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండనున్నాయో చూడాలి.దేవర సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.

దేవర1 సక్సెస్ తో దేవర సీక్వెల్ పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.దేవర2( Devara 2 ) సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉండగా ఈ సినిమా థియేటర్లలో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.అత్యంత భారీ బడ్జెట్ తో దేవర సీక్వెల్ తెరకెక్కనుందని తెలుస్తోంది.ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.