తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8( Bigg Boss Telugu 8 ) నుంచి రీసెంట్ గా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ మెహబూబ్.( Mehaboob ) ఎవరు ఊహించిన విధంగా మెహబూబ్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే.
కాగా తాజాగా హౌస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని విడుదల చేశాడు మెహబూబ్.ఈ సందర్భంగా మెహబూబ్ ఆ వీడియోలో మాట్లాడుతూ క్షమాపణలు( Apologize ) తెలిపాడు.
కాగా ఈ సందర్భంగా మెహబూబ్ మాట్లాడుతూ.బిగ్‌బాస్‌లో గంటలు గంటలు మాట్లాడితే వాళ్లు చూపించేది 30 సెకన్లు.

అయితే నేను మాట్లాడిన దానిలో చిన్న క్లిప్ బయట చాలా రాంగ్ గా ప్రొజెక్ట్ అవుతోంది.దాని గురించి మట్లాడుదాం అనే వచ్చాను.మనం బిగ్‌బాస్ లాంటి పెద్ద ప్లాట్‌ఫామ్ లో ఉన్నప్పుడు మనం మంచిగా ఆడితే, మంచిగా ప్రవర్తిస్తే, అరె మనలో ఒకడు అని మనల్ని ఇష్టపడతారు.మనకు ఓట్ చేస్తారు అని చెప్పి మాట్లాడుకున్నాము.
కానీ నేను అన్న మాట చాలామందిని బాధపెట్టింది.చాలామంది డిసప్పాయింట్ అయ్యారు.
ప్రామిస్ చేసి చెబుతున్నా నా ఉద్దేశం అదికాదు.దానికి నేను క్షమాపణలు చెబుతున్నాను అని తెలిపారు మెహబూబ్.
డబ్ స్మాష్, టిక్ టాక్, యూట్యూబ్‌లో వీడియోలు చేసుకుంటూ ఇక్కడివరకు వచ్చాను.

ఏ కాస్ట్ ఫీలింగ్ లేకుండా మీరు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు.త్వరలోనే నేను స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తాను.ఆడియెన్స్‌గా మీరందరూ గెలిచారు.
కంటెస్టెంట్‌గా నేను ఫెయిల్ అయ్యాను.ఐ యామ్ సారీ అని మెహబూబ్ వీడియోలో తన బాధనంతా బయటపెట్టాడు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







