టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) హీరోగా నటించిన తాజా చిత్రం “క”.( Ka Movie ) ఈ సినిమాలో ఉన్న సారిక, తన్వి రామ్ లు హీరోయిన్ లుగా నటించిన విషయం తెలిసిందే.
శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.ఈ సినిమా ఈ నెల 31న అనగా రేపు విడుదల కానున్న విషయం తెలిసిందే.
కాగా ఈ క సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు.

హీరో నాగ చైతన్య( Naga Chaitanya ) ముఖ్య అతిథిగా ఈ రోజు క సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.కాగా ఈ కార్యక్రమంలో భాగంగా ప్రొడ్యూసర్ SKN మాట్లాడుతూ.భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని అభిమానులు మన రాష్ట్రానికే సొంతం.
క సినిమా కంటెంట్ ను నా మిత్రుడు వంశీ నందిపాటి చూపించాడు.మెస్మరైజింగ్ గా ఉంది కంటెంట్.
సినిమా చివరి పది నిమిషాలు మాత్రం ర్యాంపేజ్ లా ఉంటుంది.కిరణ్ అబ్బవరం కంటెంట్ మీద సినిమాలు చేసే హీరో.
ఇలాంటి హీరోలు బాగుంటే ఇండస్ట్రీ కూడా బాగుంటుంది.ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణ రెడ్డి( Producer Chinta Gopalakrishna Reddy ) గారికి నా బెస్ట్ విశెస్ చెబుతున్నాను.

అలాగే సినిమాను రిలీజ్ చేస్తున్న నా ఫ్రెండ్ వంశీకి ఆల్ ది బెస్ట్.తను పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు వంటి సక్సెస్ ఫుల్ సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాడు.ఈరోజు క సినిమాకు కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది.ఈ సినిమా కూడా తనకు మంచి సక్సెస్ ఇవ్వాలి.అలాగే మోస్ట్ హంబుల్ హీరో నాగ చైతన్య గారికి థ్యాంక్స్ చెబుతున్నాను ఈ ఈవెంట్ కు వచ్చినందుకు.తప్పకుండా క సినిమా పెద్ద విజయం సాధిస్తుంది అని తెలిపారు ఎస్కేఎన్.
ఈ సందర్బంగా ఆయన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







