దేవుడా.. ప్రభాస్ మూవీ క్యాన్సిల్ అయిందట.. స్టార్ హీరోకు షాక్ వెనుక కారణాలివే!

హీరో ప్రభాస్( Prabhas ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రభాస్ ప్రస్తుతం వరసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Prabhas Siddharth Anands Movie Got Canceled Because It Was A Multi Starrer Proje-TeluguStop.com

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, ప్రస్తుతం అదే ఊపుతో మరిన్ని సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు సైతం దక్కని పలు రికార్డ్‌ లను ప్రభాస్ దక్కించుకోవడంతో ఉత్తర భారతంలోనూ టాప్‌ స్టార్‌ గా ప్రభాస్ నిలిచారు.

సుదీర్ఘ కాలంగా బాలీవుడ్‌ లో చక్రం తిప్పుతున్న స్టార్స్‌ ను సైతం ప్రభాస్‌ పక్కకి నెట్టారు.బాహుబలితో పాటు సాహో సినిమా సైతం బాలీవుడ్‌ లో సూపర్‌ హిట్‌ అందుకుంది.

Telugu Adipurush, Multistarrer, Prabhas, Salman Khan, Shahrukh Khan, Siddarth An

తెలుగు లో సాహో తీవ్రంగా నిరాశ పరచినా హిందీలో మాత్రం భారీ వసూళ్లు సాధించి ఆశ్చర్యపరిచింది.అప్పటి నుంచి పలువురు బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ ప్రభాస్‌తో హిందీ సినిమాలు చేయాలని భావించారు.అయితే ఆదిపురుష్‌( Adipurush ) సినిమా ను ప్రభాస్‌ హిందీలోనే చేశారు.ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందిన ఆదిపురుష్ బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచింది.అయినా హిందీలో ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.అందుకే ప్రముఖ నిర్మాతలు, దర్శకులు ఆయనతో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

బాలీవుడ్‌ కు చెందిన ప్రముఖ కమర్షియల్‌ చిత్రాల దర్శకుడు సిద్దార్థ్‌ ఆనంద్‌( Director Siddharth Anand ) కూడా ప్రభాస్‌ తో చర్చలు జరిపారు.మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ లో ప్రభాస్‌, సిద్దార్థ్‌ ఆనంద్‌ ల మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి.

Telugu Adipurush, Multistarrer, Prabhas, Salman Khan, Shahrukh Khan, Siddarth An

కానీ ఆ సినిమా స్క్రిప్ట్‌ దశలోనే క్యాన్సిల్‌ అయిందని తెలుస్తోంది.సిద్దార్థ్‌ ఆనంద్‌ మొదట ప్రభాస్‌ ని సోలో హీరోగా అనుకున్నా ఆ తర్వాత మల్టీ స్టారర్‌ గా మార్చారట.షారుఖ్ ఖాన్‌ తో( Shahrukh Khan ) స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలని ప్రభాస్‌ ను దర్శకుడు సిద్దార్థ్‌ ఆనంద్‌ కోరినట్లు టాక్.పైగా కథలోనూ షారుఖ్ పాత్ర డామినేటింగ్‌ గా ఉందని, అందుకే ప్రభాస్‌ ఆ ప్రాజెక్ట్‌ ని వద్దు అనుకున్నారనే వార్తలు ప్రస్తుతం జోరుగా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతానికి తనకు మల్టీస్టారర్ సినిమాలు చేసే ఉద్దేశం లేదని తేల్చి చెప్పి సిద్దార్థ్‌ ఆనంద్‌ సినిమా నుంచి ప్రభాస్ బయటకు వచ్చేశారని టాక్.బాలీవుడ్‌ మీడియా కథనాల ప్రకారం సిద్దార్థ్ ఆనంద్‌ దర్శకత్వంలో ప్రభాస్ నటించేందుకు ఆసక్తి చూపించినా, మల్టీ స్టారర్‌ స్క్రిప్ట్‌ ను ఆయన ముందుకు తీసుకు రావడం వల్ల నో చెప్పారని అంటున్నారు.

మరి ఈ విషయంలో నిజానిజాలు తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube