మన భారతదేశంలో ప్రతి ఒక్కరి ప్రతిభకు ఎటువంటి కొరత లేదని చెప్పాలి.ఎవరైనా సరే ఏదైనా సాధించాలని నిర్ణయం తీసుకుంటే చాలు రికార్డులు సృష్టిస్తారు.
ప్రస్తుతం దీపావళి పండుగ సందర్భంగా ఒక చెఫ్ కేవలం 24 గంటలలో 10,000 దోశలు తయారు చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు.అతడు చేసిన ఈ వింత చాలెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
ఇక అసలు ఎవరు ఈ చెఫ్ అన్న విషయానికి వస్తే.నాగపూర్ కు( Nagpur ) చెందిన ఫేమస్ చెఫ్ విష్ణు మనోహర్.
( Chef Vishnu Manohar ) ఇతడిని అక్కడి స్థానికులు అందరూ కూడా ప్రౌడ్ అఫ్ నాగపూర్ అని పిలుస్తారట.

వాస్తవానికి విష్ణు మనోహర్ వంటలలో అద్భుత టాలెంట్ ఉన్నవాడు.అతని ప్రతిభతో ప్రముఖ చెఫ్ గా పేరును సొంతం చేసుకున్నాడు.ఇక కేవలం ఆయన కుకింగ్ స్టైల్ తో ఎంతోమందిని ఎంతగానో ఆకట్టుకున్నాడు.
అంతేకాకుండా అతని చేతులతో ఏది వండినా కానీ భోజన ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాడు.ఇప్పటివరకు తన టాలెంట్ తో ఏకంగా 25 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నాడు.
ప్రస్తుతం ఈ దోశ చాలెంజ్( Dosa Challenge ) కంటే ముందు అయోధ్యలో 7000 కిలోలతో రామ్ హల్వాను తయారుచేశాడు.దేశంలోనే అతిపెద్ద వెజిటేరియన్ కబాబుతోపాటు, అతిపెద్ద పరాటాను కూడా తయారు చేసి రికార్డులలో ఎక్కాడు.

సరికొత్త దోశ చాలెంజ్ తో నాగపూర్ ను ప్రపంచ వేదిక పైకి తీసుకొని వచ్చారు.ఈ సందర్భంగా అన్నపూర్ణ మాత ఆశీస్సులతో విష్ణు కేవలం మొదటి తొమ్మిది గంటలలోనే 6750 దోశలు తయారు చేశాడు.ఇక విష్ణు మనోహర్ చేస్తున్నా ఈ అద్భుతాన్ని చూసేందుకు అనేకమంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు.ఈ క్రమంలో విష్ణు మనోహర్ ఒకేసారి రెండు ప్రపంచాన్ని రికార్డులను సొంతం చేసుకున్నాడు.
అందులో మొదటిది 24 గంటల పాటు నాన్ స్టాప్ గా దోశలు వేయడం.రెండవది 24 గంటలలో గరిష్ట సంఖ్యలో దోశలు తయారు చేయడం.ఇక ఇందుకోసం విష్ణు 8 పాన్లతో 3 భట్టీలను ఉపయోగించి 1000 కిలోల దోస పిండి దోశలను చట్నీ, సాంబార్ తో వడ్డించారు.ఇకపోతే, ఈ చాలెంజ్ కు ఉచిత ప్రవేశం అవ్వడంతో భారీగా జనాలు తరలివచ్చారు.
అంతేకాకుండా.ఇందులో ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ అనే పద్ధతిలో దోశను సర్వ్ చేసినట్లు తెలుస్తుంది.








